పెళ్లిళ్లకి గెస్ట్ లుగా వెళ్తే డబ్బులిస్తారా.. నాగ్ ఏమన్నారంటే..

గతంలో కింగ్ నాగార్జున ఈ విషయాన్ని చెప్పాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి.

Update: 2024-03-07 04:42 GMT

తాజాగా ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో బాలీవుడ్ సెలబ్రెటీలు చాలా మంది సందడి చేశారు. సౌత్ నుంచి రామ్ చరణ్ దంపతులు హాజరయ్యారు. అలాగే క్రికెటర్ ధోని, రోహిత్ శర్మ కూడా భార్యలతో కలిసి ఈ వెడ్డింగ్ కి హాజరయ్యారు. ఓ విధంగా ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ స్టార్స్ తో నిండిపోయింది. దేశంలోనే అపర కుబేరుడు అంబానీ ఫ్యామిలీ వేడుక అంటే సెలబ్రెటీలు రాకుండా ఎలా ఉంటారని అందరూ అనుకుంటారు.

ఈ ప్రీవెడ్డింగ్ వేడుకలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ స్టేజ్ మీద డాన్స్ లు కూడా చేశారు. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కి చిందులేశారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో అనంత అంబానీ పెళ్లి వేడుక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. అయితే కార్పొరేట్ వ్యాపారుల ఇంట్లో ఫంక్షన్స్, పెళ్లిళ్లకి హాజరైతే సెలబ్రెటీలకి కోట్ల రూపాయిల చెల్లిస్తారంట.

గతంలో కింగ్ నాగార్జున ఈ విషయాన్ని చెప్పాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. వ్యాపారుల ఇంట్లో జరిగే పెళ్లిళ్లకి వస్తే డబ్బులు ఇస్తామని ఆహ్వానాలు వస్తాయి. నచ్చిన వాళ్ళు వెళ్తూ ఉంటారు. నాకు కూడా అలాంటి ఆఫర్స్ చాలా సార్లు వచ్చాయి. అయితే అలా డబ్బులు తీసుకొని ఈవెంట్స్ కి వెళ్లే అలవాటు తనకి లేదని, అందుకే వచ్చిన ఆఫర్స్ ని కూడా తిరస్కరించినట్లు నాగార్జున చెప్పారు.

అయితే ఈ వేడుకల్లో అందరూ కూడా డబ్బులు తీసికొని వెళ్ళరు. కొందరు అంబానీకి సన్నిహితులుగా ఉంటారు. రామ్ చరణ్ అయితే ఒక మంచి స్నేహ భావంతోనే అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా కంగనా అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ ఈవెంట్ లో సెలబ్రేటీలు డాన్స్ లు చేయడంపై రియాక్ట్ అయ్యింది. డబ్బులు తీసుకొని అలాంటి కార్పొరేట్ ఈవెంట్స్ కి వెళ్లి డాన్స్ లు చేసే నైజం తనది కాదు. నాకు ఆత్మగౌరవం ఉంది. నా వ్యక్తిత్వాన్ని ఎప్పటికి వదులుకోను అంటూ కామెంట్స్ చేసి పరోక్షంగా ఖాన్ త్రయంపై కామెంట్స్ చేసింది.

అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ పుణ్యమా అని సెలబ్రెటీల సందడి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటే మీడియా ఫోకస్ మొత్తం వారిపైనే ఉంది. నాగ్, కంగనా లాంటి వారు అలాంటి ఈవెంట్స్ పై చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. వీటిని కొంతమంది సమర్ధిస్తూ ఉంటే మరికొంత మధ్య వ్యతిరేకిస్తున్నారు.

Tags:    

Similar News