వెంకటేష్, నాగార్జున లెక్క తేలాలి..!
సంక్రాంతి అంటేనే తెలుగు సినిమాల పండుగ అనేలా ఆ వైబ్ కనిపిస్తుంది. ఇప్పుడే కాదు ఈ సెంటిమెంట్ ఏళ్ల తరబడి నుంచి వస్తుంది
సంక్రాంతి అంటేనే తెలుగు సినిమాల పండుగ అనేలా ఆ వైబ్ కనిపిస్తుంది. ఇప్పుడే కాదు ఈ సెంటిమెంట్ ఏళ్ల తరబడి నుంచి వస్తుంది. స్టార్ సినిమాలు సంక్రాంతికి రావడం అభిమానుల కోలాహలంతో బాక్సాఫీస్ రికార్డులు బద్ధలవ్వడం తెలిసిందే. సంక్రాంతి అనగానే ప్రతి స్టార్ వారి సినిమాలతో ఫ్యాన్స్ ని అలరించాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం, ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో హనుమాన్ సంక్రాంతి సినిమాల సందడి మొదలు పెట్టాయి.
రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవ్వడంతో రెండిటి మీద ఆడియన్స్ బజ్ ఏర్పడింది. అయితే గుంటూరు కారం సినిమా స్టార్ డైరెక్టర్ త్రివిక్రం సూపర్ స్టార్ మహేష్ కాంబో అవ్వడం వల్ల ఆ సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా గురువారం సాయంత్రం నుంచే హంగామా కనిపిస్తుంది. ఓ పక్క కంటెంట్ బేస్డ్ మూవీ హనుమాన్ మీద కూడా ప్రచార చిత్రాలు బాగుండటం వల్ల సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.
అయితే రెండు సినిమాల్లో మహేష్ గుంటూరు కి మిక్సెడ్ టాక్ రాగా.. హనుమాన్ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. తేజ సజ్జా లీడ్ రోల్ లో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా మంచి కథ.. అద్భుతమైన గ్రాఫిక్స్.. గూస్ బంప్స్ తెప్పించే క్లైమాక్స్ తో సినిమా ప్రేక్షకులను మెప్పించింది. అయితే సంక్రాంతికి రిలీజైన రెండు సినిమాల లెక్క తేలింది. ఇక తేలాల్సింది మరో రెండు సినిమాల లెక్క. అందులో విక్టరీ వెంకటేష్ సైంధవ్, కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమాలు ఉన్నాయి.
శైలేష్ కొలను డైరెక్షన్ లో వెంకటేష్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న న్యూ ఏజ్ యాక్షన్ మూవీ సైంధవ్. సినిమా ట్రైలర్ అంచనాలు పెంచగా తప్పకుండా సినిమా వెంకటేష్ మార్క్ కమర్షియల్ హిట్ కొడుతుందని అంటున్నారు. ఇక సంక్రాంతి మూవీగా నా సామిరంగ కూడా ప్రచార చిత్రాలతో మంచి బజ్ ఏర్పరచుకుంది. అసలే నాగార్జునకు సంక్రాంతి సీజన్ అంటే బాగా కలిసి వస్తుంది. సో నా సామిరంగ సినిమా కూడా టాక్ బాగుంటే వసూళ్ల హంగామా సృష్టించడం పక్కా. గుంటూరు కారం, హనుమాన్ సినిమాల ఫలితాలు తేలిపోయాయి. ఇక సైంధవ్, నా సామిరంగ సినిమాల రిజల్ట్ తెలియాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు కూడా వస్తే సంక్రాంతి విన్నర్ ఎవరన్నది క్లియర్ కట్ గా అర్ధమవుతుంది.