కర్ణుడు, అశ్వద్ధామ..ఇది నాగ్ అశ్విన్ అసలు క్లారిటీ!

పార్ట్ 2లో భైరవ పాత్రకి స్కోప్ ఎక్కువ ఉంటుందని తాజాగా జరిగిన మీడియా మీట్ లో నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు

Update: 2024-07-06 09:48 GMT

కల్కి 2898ఏడీ మూవీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 800+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని ఈ మూవీ కలెక్ట్ చేసింది. డీసెంట్ కలెక్షన్స్ తో ఈ మూవీ నడుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ భైరవ క్యారెక్టర్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి కనెక్ట్ అయ్యింది. అలాగే అశ్వద్ధామ రోల్ కూడా నచ్చింది. నిజానికి పార్ట్ 1లో భైరవ క్యారెక్టర్ కంటే అశ్వద్ధామకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికింది. నాగ్ అశ్విన్ కథని ఎంచుకున్న విధానం బట్టి అశ్వద్ధామ పాత్రని కల్కి 2898ఏడీలో ఎక్కువ చూపించారు.

పార్ట్ 2లో భైరవ పాత్రకి స్కోప్ ఎక్కువ ఉంటుందని తాజాగా జరిగిన మీడియా మీట్ లో నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఈ సినిమా గురించి మీడియా ప్రతినిధులు అడిగిన అన్ని ప్రశ్నలకి నాగ్ అశ్విన్ తన వైపు నుంచి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో అశ్వద్ధామ, కర్ణుడి పాత్రలని పాజిటివ్ గా రిప్రజెంట్ చేశారనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. దీనిపై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. నేను మహాభారతం మొత్తం చదివాను.

సినిమాలో కృష్ణుడి పాత్రతో కర్ణుడు, అశ్వద్ధామకి నేను ఇచ్చిన ఎలివేషన్ కంటే మహాభారతంలో ఇంకా ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు. అదంతా నేను సినిమాలో చూపించలేదు. అలాగే ఇండియాలో మెజారిటీ ప్రజలకి కర్ణుడి పాత్ర మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది. నాకు కూడా మహాభారతంలో కర్ణుడి పాత్ర బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే అతని పాత్రకి పాజిటివ్ ఎండ్ ఇవ్వాలని అనుకోని కల్కి కథలో కొత్తగా ప్రెజెంట్ చేశానని నాగ్ అశ్విన్ చెప్పారు.

అలాగే పార్ట్ 1లో 40 శాతం కథని మాత్రమే చెప్పానని 60% స్టోరీ కల్కి పార్ట్ 2 లో ఉంటుందని నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. అలాగే కలియుగం 6000 సంవత్సరాలు అని చూపించడానికి కారణం ఉందని, ఈ కలియుగంలో ఒక రోజు 72 రోజులతో సమానం అని చెబుతారు. ఆ లెక్క ప్రకారమే నేను కల్కి స్టోరీ టైంలైన్ తీసుకోవడం జరిగిందని చెప్పాడు. అలాగే కల్కి రిలీజ్ తర్వాత ధర్మం, అధర్మం అనే వాటిమీద సమాజంలో చర్చ నడుస్తూ ఉండటం సంతోషంగా అనిపిస్తుందని అన్నారు.

కల్కి కథ ద్వారా మన ఇతిహాసాలని పిలల్లకి చేరువ చేయాలని అనుకున్నాను. ప్రస్తుతం బుజ్జి కారుతో పిల్లలు ఫోటోలు దిగడం కనిపిస్తోంది. దేశం మొత్తం బుజ్జి తిరుగుతుంది. వీటిని చూస్తుంటే హ్యాపీగా ఉంది. కల్కి 2898ఏడీ పార్ట్ 2లో ప్రత్యేకంగా క్యారెక్టర్స్ ని పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి కథని మరింత క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తానని నాగ్ అశ్విన్ మీడియా మీట్ లో క్లారిటీ ఇచ్చారు. అలాగే నవీన్ పొలిశెట్టి, నానిని పార్ట్ లో గెస్ట్ రోల్స్ కోసం తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News