అన్నింటిని డిలీట్ చేసిన నిర్మాత...అంతా కూల్ ఇప్పుడు!
సోషల్ మీడియాలో వివాదాలు సర్వసాధారణం. అభిమానులు-అభిమానుల మధ్య... దర్శకనిర్మాతల మధ్య అప్పుడప్పుడు నెట్టింట వాడి వేడి చర్చ సాగుతుంటంది.
సోషల్ మీడియాలో వివాదాలు సర్వసాధారణం. అభిమానులు-అభిమానుల మధ్య... దర్శకనిర్మాతల మధ్య అప్పుడప్పుడు నెట్టింట వాడి వేడి చర్చ సాగుతుంటంది. ఆ తర్వాత కాసేపటికి చల్లారిపో తుంటుం ది. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పడం లో కాస్త అటు ఇటు అయినా ఇలాంటి వివాదాలకు దారి తీస్తుంటాయి. `గుంటూరు కారం` లోని ఓ మై బేబి సాంగ్ పై నెటి జనులు కామెంట్లు ..`యానిమల్` పై నిర్మాత నాగవంశీ కామెంట్ నెట్టింట ఎలాంటి విమర్శలకు..వాదోపవాదనలకు దారి తీసిందో తెలిసిందే.
నిన్నటి రోజున `ఓ మై బేబి` సాంగ్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దీంతో పాట రచయిత రామజోగయ్య శాస్త్రి సైతం సీన్ లోకి వచ్చారు. కాసేపు వాదించి ఆయన ఏకంగా సోషల్ మీడియాకే గుడ్ బై చెప్పేసారు. ఆ వెంటనే నిర్మాత నాగవంశీ లైన్ లోకి వచ్చారు. ట్రోలర్లపై తనదైన శైలిలో విరుచుకు పడ్డారు. ఈ ప్రోసస్ లోనే `యానిమల్` సినిమాలో మంకీ స్టోరీ వీడియోని షేర్ చేసి.. `మేం ఏం చేస్తున్నామో మాకు తెలుసు.. జనవరి 12వ తేదీన చూసుకుందాం’ అని కౌంటర్ వేశారు. దీంతో అభిమానులు హర్ట్ అయ్యారు.
ప్రతిగా ఆయనపై ఎటాకింగ్ కి దిగారు. ఆ తర్వాత కాసేపటికి నాగవంశీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. `ఒక నిర్మాతగా నా సమాధానం మిమ్మల్ని హర్ట్ చేసి ఉండవచ్చు. కానీ మా టీమ్‌లోని వారు వారి పనులతో బిజీగా ఉంటే.. వారిపై మీరు చేసే ట్రోలింగ్.. అసభ్యకర మాటలు ఎంత బాధించి ఉంటాయో అర్థం చేసుకోండి. ఎటువంటి అసభ్యకరమైన పదాలు వాడకుండా.. ఎవరినీ టార్గెట్ చేయకుండా.. అనవస రమైన కఠిన పదాలు వాడకుండా ఇచ్చే అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నాం.
మర్యాదపూర్వకంగానూ మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. ఇప్పటి వరకు చూడని మాస్ అవతార్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుగారిని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేద్దాం` అని నాగ వంశీ మరో ట్వీట్ చేసారు. దీనిపైనా కొంతమంది నెటి జనులు మండిపడ్డారు. అయితే ఈ విషయంలో నాగవంశీకి చాలా మంది నెటి జనులు మద్దతు పలికారు. `మీకు వంద కారణాలు ఉండవచ్చు.. కానీ దానిని తెలియజేసే విధానం మర్యాద పూర్వకంగా ఉండాలి. అంతేకానీ.. ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయకూడదు. ఈ విషయంలో నాగవంశీగారి కే మా సపోర్ట్` అంటూ మద్దతు పలికారు. అయితే నాగవంశీ ఆ వివాదానికి సంబంధించిన అన్ని రకాల ట్వీట్లను తొలగించారు. ప్రస్తుతం ఎలాంటి వివాదం లేదు.