నాగ్ అశ్విన్ 'కల్కి'.. టైమింగ్ బాగుంది!
అదే సమయంలో మేకర్స్.. నిన్న ప్రీ లూడ్ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.
టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కల్కి 2898 ఏడీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్.. రూ.600 కోట్లకుపైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 27వ తేదీన విడుదల కానుంది. ప్రభాస్ తోపాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్ సహా ఎందరో నటీనటులను రంగంలోకి దింపారు మేకర్స్.
అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా.. ప్రమోషన్స్ అనుకున్నంత స్థాయిలో జరగలేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో మేకర్స్.. నిన్న ప్రీ లూడ్ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. వరల్డ్ ఆఫ్ కల్కి పేరుతో సినిమా విషయాలను పంచుకునేందుకు సిద్ధమైన నాగ్ అశ్విన్.. ఫస్ట్ వీడియోను రిలీజ్ చేశారు. కల్కి 2898 ఏడీ స్టోరీ పురాణాలు అన్నింటికీ క్లైమాక్స్ లాగా ఉంటుందని చెప్పి అంచనాలు పెంచారు నాగి.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ట్రైలర్ కన్నా ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. పురాణాలపై ఆసక్తి ఉన్న వారిని సినిమాకు బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తోంది. సినిమాపై అన్ని వర్గాల ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేస్తోంది. మహాభారతంతోపాటు పురాణాల గురించి నాగ్ అశ్విన్ వివరించిన తీరు అదిరిపోయిందని నెటిజన్లు చెబుతున్నారు.
మొత్తానికి.. ప్రీ లూడ్ వీడియో సరైన టైమ్ కు రిలీజ్ చేశారని కొందరు చెబుతున్నారు. ఇంకాస్త ముందు విడుదల చేసి ఉంటే ఇంకా బాగుండేదని అంటున్నారు. ఏదేమైనా సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ అవుతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదే ర్యాపో రిలీజ్ వరకు కంటిన్యూ చేస్తే మూవీకి తిరుగులేదని అభిప్రాయపడుతున్నారు. నాగ్ అశ్విన్ అసలు ప్లాన్ అమలు చేసే టైమ్ వచ్చేసిందని అంటున్నారు.
ఇక ఈ సినిమా కథ రాయడానికి 5 ఏళ్లు పట్టిందని తెలిపారు నాగ్ అశ్విన్. కలియుగంలో ఏం జరుగుతుంది? ఏం జరిగే అవకాశం ఉంది? అనే అంశాలు సినిమాలో ఉంటాయని చెప్పారు. కేవలం ఇండియాలోని సినీ ప్రియులే కాదు.. ప్రపంచంలో ఉన్న వారంతా సినిమాకు కనెక్ట్ అవుతారని తెలిపారు. సైన్స్ కు మైథాలజీని యాడ్ చేసి తీశానని చెప్పారు. మరి ఈ మూవీ సినీ ప్రియులను ఎలా అలరిస్తుందో తెలియాలంటే వేచి చూడాలి.