'మిస్టర్ బచ్చన్'.. అబ్బాబ్బో ఇది అరాచకం

మాస్ రాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ విడుదలకు సిద్ధమైంది

Update: 2024-08-12 12:56 GMT

మాస్ రాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ విడుదలకు సిద్ధమైంది. పూర్తి స్థాయిలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. రిలీజ్ అయిన పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా ప్రేక్షకులలో అంచనాలను పెంచాయి.

మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి తాజాగా విడుదలైన నల్లంచు తెల్లచీర.. అబ్బాబ్బో ఇది అరాచకం.. సాంగ్ ప్రోమో ఆడియెన్స్‌ను ఆకట్టుకునే మాస్ ట్యూన్స్‌తో నిండిపోయింది. ఈ పాటను శ్రీరామచంద్ర, సమీర భరద్వాజ్ కలిసి పాడారు. మిక్కీ జే మేయర్ ఈ పాటకు చక్కటి మాస్ ట్యూన్స్ కంపోజ్ చేశాడు. ఈ సాంగ్ ప్రోమో నేడు జరగబోయే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విడుదల కానుంది.

పాటలో రవితేజ, భాగ్య శ్రీ మాస్ స్టెప్పులు గట్టిగానే ఉండబోతున్నట్లు అర్ధమవుతుంది. ఇక వీరి కెమిస్ట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో అనేది పోస్టర్స్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది. మిస్టర్ బచ్చన్’ చిత్రంలో రవితేజ మాస్ లుక్, హరీష్ శంకర్ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను మెప్పించనుంది. ఇందులో భాగ్యశ్రీ బొర్సె కథానాయికగా నటిస్తుండగా, జగపతి బాబు విలన్ పాత్రలో ఆకట్టుకోనున్నారు.

పీపుల్ మీడియ ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు మరింత పెరుగుతున్నాయి. మాస్ మసాలా ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రవితేజ గత చిత్రాల విజయాలను దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమా కూడా హిట్ అవుతుందనే ఆశతో అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఈ నెల ఆగస్టు 15 న మిస్టర్ బచ్చన్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే హిట్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకుముందు వీరి కలయిక లో వచ్చిన మిరపకాయ్ సినిమా బిగ్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

Full View
Tags:    

Similar News