నమ్రత ఔట్ వేర్ రూ.8లక్షలా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కు కూడా సూపర్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.

Update: 2024-09-01 15:16 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కు కూడా సూపర్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు తన అందంతో మంచి పేరు సంపాదించుకున్న ఆమె.. ఇప్పుడు భర్తకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నమ్రత.. మిస్ ఇండియా యూనివర్స్, మిస్ ఇండియా ఏషియా పసిపిక్ గా సెలెక్ట్ అయ్యి సత్తా చాటారు. ఆ తర్వాత యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో జబ్ ప్యార్ కిసీసే హోతా హై హిందీ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.


అనంతరం అనేక బాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేసి మెప్పించారు. బీటౌన్ లో ఫుల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న టైమ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ మూవీలో ఛాన్స్ అందుకున్నారు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా డిజాస్టర్ గా మారింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి అంజి మూవీలో నమ్రత నటించారు. అది కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. అలా.. తెలుగులో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోయారు నమ్రతా శిరోద్కర్.


ఇక వంశీ మూవీ టైమ్ లో మహేష్ బాబుతో ప్రేమలో పడ్డ నమ్రత.. చాలా కాలంపాటు ఇద్దరూ రహస్యంగా ప్రేమాయణాన్ని నడిపించారు. నాలుగేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన వారిద్దరూ.. పెద్దలను ఒప్పించి 2005లో పెళ్లి చేసుకున్నారు. వారి వివాహ బంధానికి గుర్తుగా గౌతమ్, సితార జన్మించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన నమ్రత.. మహేష్ బాబు వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. డేట్స్, డ్రెస్సింగ్, బిజినెస్ అలా అన్నింటిలో తన మార్క్ చూపిస్తున్నారు.

అయితే మహేష్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. తరచూ వెకేషన్స్ కు వెళ్తుంటారు. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీ న్యూయార్క్ ట్రిప్ లో ఉంది. అందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. న్యూయార్క్ వీధుల్లో మహేష్ అండ్ కో ఫోజులిచ్చిన పిక్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. అందులో నమ్రత చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆమె ఔట్ ఫిట్ మరింత అట్రాక్టివ్ గా నిలుస్తోంది.

బ్లూ జీన్ అండ్ వైట్ షర్ట్ వేసుకున్న నమ్రత డిసెంట్ గా కనిపిస్తున్నారు. ఆ సమయంలో ఆమె వేసుకున్న ఔట్ వేర్ అదిరిపోయింది. LV Louis vittan కంపెనీకి చెందిన ఆ ఔట్ వేర్ ధర రూ. 8 లక్షలట. ఈ విషయం తెలిసి నెటిజన్లు షాక్ అయిపోతున్నారు. ఎనిమిది లక్షలా అంటూ నోరెళ్ళబెడుతున్నారు. మళ్ళీ మళ్ళీ నెట్టింట ఆ ఔట్ వేర్ కోసం సెర్చ్ చేస్తున్నారు.

Tags:    

Similar News