నందమూరి ఫ్యామిలీ అంతా ఒకే బస్సులోనా!
నటసింహా బాలకృష్ణ తెలుగు చలన చిత్ర పరిశ్రమకొచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా స్వర్ణోత్సవాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.
నటసింహా బాలకృష్ణ తెలుగు చలన చిత్ర పరిశ్రమకొచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా స్వర్ణోత్సవాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంకా వేడుకకు కొన్ని గంటలే సయం ఉంది. ఈవేడుకకు పెద్ద ఎత్తు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. మరి ఈవేడుకలో నందమూరి -నారా ఫ్యామిలీ నుంచి ఎవరొస్తున్నారు? ఆ బాధ్యతలు ఎవరు చూసుకుంటున్నారు? అంటే ఆ మొత్తం బాధ్యతని నందమూరి రామకృష్ణకు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఆయనకు నందమూరి ఫ్యామిలీ అందరితోనూ మంచి సత్ససబంధాలున్నాయి. వాళ్ల తరం జనరేషన్ నుంచి తర్వాత తరం వరకూ అందరితోనూ ఆయన ఎక్కువగా టచ్ లో ఉంటారుట. ఈ నేపథ్యంలో రామకృష్ణ అయితేనే ఎవర్నీ మిస్ చేయకుండా అందర్నీ ఆహ్వానిస్తారని, వాళ్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటారని బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
అన్నింటికంటే ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో కూడా ఆయన ఎంతో క్లోజ్ గా ఉంటారుట. వాళ్లను తీసుకొచ్చే ప్రధాన బాధ్యతను ఆయన నెత్తిపైనే పెట్టినట్లు సమాచారం. అయితే వాళ్లిద్దరు వస్తారా? రారా? అన్నది ఇంకా కన్పమ్ కాలేదు. ఇప్పటికే హీరోల నుంచి కొంత మంది పేర్లు బయటకు వచ్చాయి. అందులో తారక్, కళ్యాణ్ రామ్ పేర్లు లేవు. వస్తారా? రారా? అన్నది తమకు తెలియదని అదంతా రామకృష్ణ చూసుకుంటున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
అలాగే నారా ఫ్యామిలీ నుంచి కూడా కొంత మందిని రామకృష్ణ స్వయంగా ఆహ్వనించినట్లు తెలుస్తోంది. అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చే వారంతా బాలయ్య ఇంటికి చేరుకుని అక్కడ నుంచి అంతా ఒకే బస్సులో సభా ప్రాంగాణానికి చేరుకునే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. అక్కినేని నాగార్జున అటెండ్ అవ్వడం కూడా కష్టమే. ప్రస్తుతం ఆయన ఎన్ కన్వెన్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. గతంలో కూడా సీనియర్ ఎన్టీఆర్ వేడుకకు నాగచైతన్యని పంపించారు. మరి ఈసారి ఎవరైనా హాజరవుతారా? లేదా? అన్నది చూడాలి.