మోక్షజ్ఞ డెబ్యూకి ముహూర్తం ఫిక్స్?
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. నందమూరి అభిమానులు చాలా కాలంగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. బాలయ్య వారసుడిగా వెండితెరపై మోక్షజ్ఞని చూసుకోవాలని అనుకుంటున్నారు. ఇన్నాళ్లకి వారి కోరిక నెరవేరబోతోంది. బాలయ్య కూడా చాలా కాలంగా కొడుకుని హీరోగా పరిచయం చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే సరైన కథతో బెస్ట్ డైరెక్టర్ చేతిలో పెట్టాలని భావించడంతో డెబ్యూ లేట్ అయ్యింది.
ఫైనల్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక సూపర్ హీరో మూవీతో అతనిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 6న వినాయక చవితికి ముందు రోజు ఈ సినిమా లాంచింగ్ ఉండబోతోందంట.
రామకృష్ణ స్టూడియోస్ లో మోక్షజ్ఞ చిత్రాన్ని లాంచ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంట. ఈ లాంచింగ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. అయితే మోక్షజ్ఞ డెబ్యూకి నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరెవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది.
సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ చేయబోయే సినిమా కథ ఏంటనేది కూడా ఒక స్పష్టత రావొచ్చని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందంట. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లాంచింగ్ డేట్ కన్ఫర్మ్ అయ్యిందనే టాక్ బయటకి రావడంతో నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా దానిని షేర్ చేస్తున్నారు. మోక్షజ్ఞ లాంచింగ్ మూవీ ఎలా ఉండబోతోందనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో వారంతా ఎదురుచూస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకోబోతున్నారు. దీనికి గాను ఇండస్ట్రీ నుంచి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతూ ఉండటం యాదృశ్చికంగా జరిగిన కూడా నందమూరి అభిమానులకి మాత్రం సర్ ప్రైజ్ అనే చెప్పాలి.