బాలయ్యా ఇది వేరొక హీరోకి సాధ్యం కాదయా!
తెలుగు సంస్కృతి అన్నా.. తెలుగు భాష అన్నా నటసింహా నందమూరి బాలకృష్ణకు ఎంతటి అభిమానమో ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.
తెలుగు సంస్కృతి అన్నా.. తెలుగు భాష అన్నా నటసింహా నందమూరి బాలకృష్ణకు ఎంతటి అభిమానమో ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినిమాకి తన తండ్రిగారు నవరసనటసార్వభౌముడు ఎన్టీఆర్ చేసిన కృషిని ఆయన చాలా వేదికలపై ప్రస్థావిస్తూనే ఉన్నారు. తాజాగా `స్కంద` ప్రీరిలీజ్ ఈవెంట్లో మరోసారి ఆయన పై రెండు అంశాలను టచ్ చేసారు. అంతేకాదు.. ఈ వేదికపై నేటి ట్రెండింగ్ టాపిక్ -చంద్రయాన్ 3 గురించి ఆయన ప్రస్థావిస్తూ .. ఈ మిషన్ లో పాలు పంచుకున్న తెలుగు సైంటిస్ట్ కుటుంబం గురించి ఎంతో డీటెయిలింగ్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది. నిజానికి అంత వివరంగా ఒక యువశాస్త్రవేత్త కుటుంబం గురించి వేరొక హీరో వర్ణించి ఉండరేమో!
అలంపూర్ గద్వాల్ జిల్లాకు చెందిన యువ ఇస్రో శాస్త్రవేత్త మిషన్ చంద్రయాన్ 3కి సహాయం చేశాడని నటసింహా బాలకృష్ణ `స్కంద` వేదికపై వెల్లడించారు. ఒక కుమ్మరి వాని కుమారుడు మద్దిరెడ్డి కృష్ణ ఇటీవల ఇస్రో మిషన్ చంద్రయాన్ 3 కోసం ఒక ఉపకరణాన్ని రూపొందించారు. ఇది చంద్రుని దక్షిణ ధ్రువంలో దిగింది. గ్రూప్స్ రాసి గవర్నమెంట్‌లో పనిచేస్తూ ఇస్రో టెస్ట్‌ల్లో అతడు పాసయ్యాడు. చంద్రుడిపై భూకంప కార్యకలాపాలను గుర్తించే కాంపోనెంట్‌ని డిజైన్ చేశాడు! అంటూ బాలయ్య తెలిపారు. సదరు యువశాస్త్రవేత్త చరిత్ర కుటుంబం గురించి అతడు వివరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఎన్బీకే ఇస్రో శాస్త్రవేత్తను అభినందించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక నిజమైన హీరోని ఎన్బీకే ప్రశంసించిన తీరుకు ప్రశంసలు కురుస్తున్నాయి.
మరోవైపు తాను నటించిన `భగవంత్ కేసరి` చిత్రానికి తెలంగాణ యాస యుఎస్.పి అని చెప్పేసిన బాలయ్య అందులో తన పాత్ర సృష్టికి ఇస్మార్ట్ శంకర్ రామ్ స్ఫూర్తి అని అన్నారు. తెలంగాణ యాసను తాను ప్రయత్నించడానికి కారణం ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతినేని అంటూ ప్రశంసలు కురిపించిన బాలయ్య.. ``పీహెచ్‌డీ చేసిన రామ్‌ని అనుసరించి డిగ్రీ చేశాను``అని ఛమత్కరించారు. ``రామ్ ఇస్మార్ట్‌లో తెలంగాణ స్లాంగ్‌ని ఎఫెక్టివ్‌గా వాడడంతో నా తర్వాతి సినిమాలో భగవంత్ కేసరిగా కనిపించాను. ఇప్పుడు అతను ఇస్మార్ట్ శంకర్ 2 చేస్తున్నాడు. ఈ సినిమా మళ్లీ సవాల్ విసురుతుంది`` అంటూ బాలయ్య చలోక్తిగా మాట్లాడారు. నటసింహం ఎలాంటి భేషజం లేకుండా యువహీరో రామ్ ని పొగిడేశాడు. శ్రీలీల నటన ప్రతిభ డ్యాన్సుల గురించి ఎన్బీకే కీర్తించారు. పదహారు అణాల తెలుగు అమ్మాయి అని ప్రశంసించారు. శ్రీలీలను ఈ వేదికపై తన చేతితో ఆశీర్వదించారు.