సరిపోదా శనివారం.. కల్కి తరువాత మళ్ళీ ఆ రేంజ్ లో..

టాలీవుడ్ ఆడియన్స్ చాలా రోజులుగా ఒక మంచి మాస్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పవచ్చు.

Update: 2024-08-28 09:34 GMT

టాలీవుడ్ ఆడియన్స్ చాలా రోజులుగా ఒక మంచి మాస్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పవచ్చు. కల్కి తర్వాత చాలా విభిన్నమైన సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని చిన్న సినిమాలు పరవాలేదు అనేలా ఆకట్టుకున్నాయి. అయితే మధ్యలో వచ్చిన కొన్న మాస్ కమర్షియల్ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. కల్కి తరువాత మళ్ళీ పూర్తి స్థాయిలో థియేటర్స్ వద్ద హడావుడి కనిపించలేదు. ఆ రేంజ్ లో బుకింగ్స్ కూడా నమోదవ్వలేదు.

కానీ ఇప్పుడు నాని సరిపోదా శనివారం సినిమాతో మళ్ళీ ఆ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాడు. అందరి ఫోకస్ ఎక్కువగా సరిపోదా శనివారం సినిమా పైనే ఉంది. తప్పకుండా ఈ సినిమా ఫుల్ మీల్స్ అనేలా ఉంటుంది అని ఆడియన్స్ ఎంతో ఆశతో ఉన్నారు. ఇక ఈ సినిమా కోసం నాని చేసిన ప్రమోషన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మొదటి అప్డేట్ నుంచి కూడా నాని తీసుకుంటున్న జాగ్రత్తలు అన్నీ ఇన్ని కావు. ప్రతి ఇంటర్వ్యూలో కూడా సినిమా గురించి అలాగే మేకర్స్ కష్టపడిన విధానం గురించి నాని చెబుతున్న తీరు ఎంతగానో ఆకర్షిస్తుంది. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనేలా అప్డేట్స్ అయితే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి.

ముఖ్యంగా ట్రైలర్ ఎక్కువ స్థాయిలో వైరల్ అయ్యింది. దీంతో సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఒక రేంజ్ లో కలెక్షన్స్ రాబోతున్నట్లుగా అర్థమవుతుంది. కల్కి సినిమా తర్వాత ఆ స్థాయిలో మళ్లీ బాక్సాఫీస్ వద్ద డామినేషన్ చూపిస్తున్న సినిమాగా సరిపోదా శనివారం నిలవబోతోంది. కొన్ని రోజుల క్రితం యూఎస్ లో ప్రీమియర్స్ కు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.

ఇక టాలీవుడ్ లోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ఈ సినిమాకు మంచి బుకింగ్స్ అయితే కొనసాగుతున్నాయి. చూస్తుంటే మొదటి రోజు నాని తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా అనిపిస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను DVV దానయ్య నిర్మించారు. ఈ సినిమాలో ఎస్ జె సూర్య పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతున్న విషయం తెలిసింది.

ట్రైలర్ ద్వారా ఈ రెండు క్యారెక్టర్స్ హై వోల్టేజ్ మాస్ కంటెంట్ ఇవ్వబోతున్నట్లుగా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇప్పటికే నానికి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఇక ఇప్పుడు మాస్ ఆడియన్స్ కూడా మొదటి రోజు మొదటి షో చూడాలి అని ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. దీన్ని బట్టి సినిమాకు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News