సరిపోదా శనివారం.. రిలీజ్ టైమ్ లో ఇదెక్కడి ట్విస్ట్?

నేచురల్ స్టార్ నాని నుంచి రాబోతోన్న ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ సరిపోదా శనివారం.

Update: 2024-08-28 09:15 GMT

నేచురల్ స్టార్ నాని నుంచి రాబోతోన్న ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ సరిపోదా శనివారం. క్లాస్ చిత్రాలతో దర్శకుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన వివేక్ ఆత్రేయ ఈ సారి ఎలా అయిన కమర్షియల్ హిట్ అందుకోవాలి సరికొత్త ఎలిమెంట్ తో ఈ సినిమాను రూపొందించాడు. నానితో ఇదివరకే అంటే సుందరానికి సినిమాని తెరకెక్కించిన ఈ దర్శకుడు కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అందుకోలేదు. అయితే రెండో ప్రయత్నంగా మాస్ అండ్ యాక్షన్ కథాంశంతో సరిపోదా శనివారం సినిమాని సిద్ధం చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారు.

ఈ సినిమా రిలీజ్ కి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ప్రీమియర్ షోలతోనే మూవీ థియేటర్స్ లో సందడి చేయనుంది. టికెట్ ధరలు కూడా పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆన్ లైన్ లో బుకింగ్స్ ని స్టార్ట్ చేశారు. సినిమా మీద ఉన్న హైప్ కారణంగా ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ సినీ ప్రేమికులు కూడా సరిపోదా శనివారం చిత్రాన్ని మొదటి రోజు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

దీనికోసం ఆన్ లైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే పీవీఆర్ మల్టీప్లెక్స్ లో సరిపోదా శనివారం మూవీ అస్సలు చూపించడం లేదు. బుక్ మై షో, పేటిఎంతో పాటు వాటి స్వంత యాప్స్ లో కూడా PVR కు సంబంధించిన టిక్కెట్లు ఆన్ లైన్ లో లేకపోవడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మూడు రోజుల క్రితం ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయంట.

సడెన్ గా ఎందుకనో ఆ మల్టీప్లెక్స్ లలో సరిపోదా శనివారం మాయం అయ్యింది. పర్టిక్యులర్ గా పీవీఆర్ మల్టీప్లెక్స్ టిక్కెట్లను ఆన్ లైన్ చూపించకపోవడం ఏంటనే ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ట్విట్టర్ లో నిర్మాత డివివి దానయ్యని దీనిపై ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సమస్యని మేము పరిష్కరిస్తామని, హ్యాపీగా సినిమా చూడటానికి రెడీ అవ్వండి అంటూ రిప్లై ఇచ్చారు.

అయితే రిలీజ్ కి ఇంకా ఒక రోజు మాత్రమే ఉండగా పీవీఆర్ మల్టీప్లెక్స్ లో బుకింగ్స్ మాత్రం ఓపెన్ కాలేదు. డిస్టిబ్యూటర్స్ పీవీఆర్ వాళ్ళతో దీనిపై చర్చిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక దీనికి కారణం ఏమై ఉంటుంది అనే విషయంలోకి వెళితే.. పీవీఆర్ మల్టీప్లెక్స్ లో సోమవారం నుంచి గురువారం వరకు ఏ సినిమా అయిన 95 రూపాయిలకి చూసే విధంగా ఒక స్కీమ్ స్టార్ట్ చేశారు.

అయితే సరిపోదా శనివారం సినిమా గురువారం రిలీజ్ అవ్వడంతో ఈ మూవీ టికెట్స్ ని కూడా పీవీఆర్ లో 95 రూపాయిలకే పబ్లిక్ బుక్ చేసుకోవాలని అనుకున్నారు. ఇలా అయితే సినిమాకి హెవీగా లాస్ వస్తుందని భావించిన డిస్టిబ్యూటర్స్ పీవీఆర్ మేనేజ్మెంట్ తో మాట్లాడి మూవీ టికెట్ బుకింగ్స్ హోల్డ్ చేసారంట. 290 రూపాయలకు అమ్మాల్సిన టిక్కెట్ అంత తక్కువకు అమ్మితే చాలా నష్టం అని ఆలోచిస్తున్నారట. మరి వీరి చర్చలు ఒక కొలిక్కి వస్తే పీవీఆర్ లో మరల సరిపోదా శనివారం బుకింగ్స్ తొందరగానే ఓపెన్ అయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News