నాని లిప్ లాక్ వేస్తే ఇంట్లో యుద్దమే!
నేను నటించిన సినిమాలన్నింటిలో లిప్ లాక్ లు లేవు. సీన్ కి అవసరమైతే దర్శకుడు ఆ సీన్ తప్పకుండా కావాలని పట్టుబడితే చేస్తాను.
టాలీవుడ్ లో కూడా లిప్ లాక్ చాలా కామన్ గా మారిపోయాయి. సీన్ డిమాండ్ చేస్తే స్టార్ హీరో అయినా వాటికి నో చెప్పడం లేదు. సన్నివేశం పడటం కోసం మేము సైతం అంటున్నారు. నేచురల్ స్టార్ నాని కూడా వాటికి ఏమాత్రం నో చెప్పడం లేదు. ఈమధ్య కాలంలో ఆయన నటించిన సినిమాల్లో కూడా లిప్ లాక్..రొమాంటిక్ సన్నివేశాలు బాగానే ఇముడుతున్నాయి. జెర్సీ..శ్యామ్ సింఘరాయ్ లాంటి చిత్రాల్లో లిప్ లాక్ సన్నివేశాలు చేసాడు.
తాజాగా హాయ్ నాన్న చిత్రంలో లిప్ లాక్ లు ధారాళంగా ఉన్నట్లు కనిపిస్తుంది. మృణాల్ ఠాకూర్ తో లిప్ లాక్ సన్నివేశాల్ని ఏకంగా టీజర్ లోనే హైలైట్ చేసారు. గత సినిమాల్లో నేరుగా థియేటర్లో రివీల్ చేయకుం డా ముందుగానే తమ సినిమాలో కావాల్సినంత రొమాన్స్ ఉందని హింట్ ఇచ్చేసారు.
తండ్రీ-కుమార్తె స్టోరీ లో రొమాంటిక్ సన్నివేశాలు బాగానే హైలైట్ అవుతాయని తెలుస్తోంది. మరి ఈ లిప్ లాక్ సన్నివేశాల పట్ల నాని ఎలా ఫీలవుతాడు? ఈ మధ్య మీరు బాగానే లిప్ లాక్ లు వేస్తున్నట్లు కనిపిస్తుందంటే? ఆసక్తికర సంగతే చెప్పుకొచ్చాడు.
నేను నటించిన సినిమాలన్నింటిలో లిప్ లాక్ లు లేవు. సీన్ కి అవసరమైతే దర్శకుడు ఆ సీన్ తప్పకుం డా కావాలని పట్టుబడితే చేస్తాను. అంతకుమించి లిప్ లాక్ ల్లో నటించాలనే ఆసక్తి ఉండదు. సీన్ కోసం నటుడు కొన్ని సన్నివేశాల్లో తప్పక నటించాలి. అయితే ఇలాంటి లిప్ లాకు వేస్తే ఇంట్లో గొడవలైపో తాయని నవ్వేసాడు. నాని ఫ్యామిలీ స్టార్ అన్న సంగతి తెలిసిందే. వివాహం చేసుకున్న నానికి భార్య పిల్లలు కలరు.
నాని భార్య పేరు యలవర్తి అంజన. లిప్ లాక్ సన్నివేశాలపై గతంలో రామ్ చరణ్ కూడా సరదాగా సంభా షించిన సంగతి తెలిసిందే. సీన్ అవసరం మేర చేయాలని..ఆ తర్వాత ఇంట్లో చాలా రకాల కారణాలు చెప్పాలని నవ్వేసారు. రానా సైతం ఇలాంటి విషయాలపై జోవియల్ గా స్పందిస్తుంటారు.