నాని..వెంటనే మరొకటి!
నాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. డిసెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
నాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. డిసెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని శౌర్యువ్ అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ముఖ్యంగా ఓవర్సీస్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి భారీ ఆదరణ కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్ కోసం నాని అమెరికా వెళ్లారు. ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నాని సరసన మలయాళ బ్యూటీ ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి 'గ్యాంగ్ లీడర్' అనే సినిమాలో నటించారు.
ఇప్పుడు మరోసారి 'సరిపోదా శనివారం' మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.కోలీవుడ్ అగ్ర నటుడు SJ సూర్య కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇటీవల రిలీజైన గ్లిమ్స్ వీడియో సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ అందించారు నాని. తన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న ప్రమోషన్ లో భాగంగా అమెరికా వెళ్ళిన నాని అక్కడి వాళ్లతో మాట్లాడుతూ..
'సరిపోదా శనివారం మూవీని వచ్చే ఏడాది ఆగస్టు నెలలో రిలీజ్ కి రెడీ చేస్తున్నట్లు' చెప్పుకొచ్చాడు. కాగా వచ్చే ఏడాది ఆగస్టు 15న 'పుష్ప 2' రిలీజ్ కాబోతోంది. పుష్ప 2 రిలీజైన రెండు వారాలకి నాని 'సరిపోదా శనివారం' మూవీని విడుదల చేసేందుకు మూవీని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే మేకర్స్ నుంచి ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. కాగా ఈ సినిమాలో నాని రగుడ్ లుక్ లో కనిపించనున్నాడు.
గతంలో నాని - వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన 'అంటే సుందరానికి' మూవీ పరాజయం పాలయింది. దాంతో ఈసారి యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నారు. ఈ మూవీలో నానిని వివేక్ ఆత్రేయ కంప్లీట్ మాస్ యాక్షన్ అవతార్ లో ప్రజెంట్ చేయబోతున్నాడు. జేక్స్ బీజాయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై DVV దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.