నాని.. మరొక్కసారి కొడితే..

అందుకే ఆగష్టు 29న రాబోతున్న సరిపోదా శనివారం సినిమాకి కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

Update: 2024-08-15 08:30 GMT

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టైర్ 2 హీరోలలో అత్యధిక మార్కెట్ ఉన్న స్టార్ గా ఉన్నారు. ప్రతీ సినిమాతో మినిమమ్ 50 కోట్లకి పైగా తన కలెక్షన్స్ తెచ్చుకోగలుగుతున్నాడు. దసరా మూవీతో 100 కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయాడు. గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలు నానికి వరుస సక్సెస్ ని అందించాయి. ఈ సినిమాలతో నాని మార్కెట్ కూడా పెరిగిందని చెప్పొచ్చు. అందుకే ఆగష్టు 29న రాబోతున్న సరిపోదా శనివారం సినిమాకి కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. దసరాకి ముందు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలోనే నాని అంటే సుందరానికి సినిమా చేశారు. అయితే ఆ చిత్రం కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. ఈ సారి మాత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చే కంటెంట్ తోనే వీరిద్దరూ సరిపోదా శనివారం మూవీ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఎలివేషన్స్ తో ఉండబోతోందని అనిపిస్తోంది.

సరైన కథ పడితే నాని పెర్ఫార్మెన్స్ తో దానిని నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్తాడనే అభిప్రాయం ఉంది. సరిపోదా శనివారం మూవీ కథాంశం కూడా నాని ఇమేజ్ ని పెంచే విధంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ట్రైలర్ ని ప్యూర్ మాస్ ట్రీట్ గా వివేక్ ఆత్రేయ ప్రెజెంట్ చేశారు. దసరా సినిమా మాస్ యాక్షన్ మూవీ అయిన కూడా కాస్తా తెలంగాణ స్లాంగ్ లో ఉంటుంది. అయితే సరిపోదా శనివారం సినిమాని పూర్తిగా ఒక ఫిక్షనల్ విలేజ్ నేపథ్యంలో వివేక్ ఆత్రేయ చెబుతున్నారు.

అందుకే ఈ మూవీ అందరికి చేరువ అవుతుందని అంచనా వేస్తున్నారు. సరిపోదా శనివారం సినిమాతో నాని సక్సెస్ అందుకొని మరోసారి 100 కోట్ల క్లబ్ లో చేరితే అతని మార్కెట్ వేల్యూ అమాంతం పెరిగిపోతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ ని నాని అందుకుంటాడని ఫ్యాన్స్ కూడా బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే టైర్ 2 హీరోలలో అందరికంటే టాప్ లో నాని మార్కెట్ ఉంది. సరిపోదా శనివారం కమర్షియల్ సక్సెస్ అయితే మాత్రం టైర్ 1 హీరోల జాబితాలో నాని చేరిపోవడం గ్యారెంటీ అని అంటున్నారు.

నిర్మాతలు వంద కోట్ల బడ్జెట్ నాని మీద పెట్టడానికి ముందుకొస్తారని భావిస్తున్నారు. నెక్స్ట్ నాని వరుసగా మూడు సినిమాలు లైన్ అప్ లో పెట్టారు. అందులో సుజిత్ దర్శకత్వంలో చేయబోయే పాన్ ఇండియా మూవీ 100+ కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు టాక్ ఉంది. అయితే అది మళ్ళీ హోల్డ్ లో పడినట్లు కూడా టాక్ వచ్చింది. ఒకవేళ సరిపోదా శనివారం తో బలమైన సక్సెస్ అందుకుంటే దానయ్య ఆ సినిమాకు తగ్గట్టుగా బడ్జెట్ పెట్టె అవకాశం ఉంది. ఇక శ్రీకాంత్ ఓదేలతో మరోసారి నాని జత కడుతున్నాడు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 150 కోట్లు అని తెలుస్తోంది.

Tags:    

Similar News