నాని.. 100 కోట్లకు ఇదే బెస్ట్ ఛాన్స్..

కచ్చితంగా ఈ సినిమాతో ప్రేక్షకులకి నాని మరోసారి మాస్ ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

Update: 2024-08-17 11:16 GMT

రామ్ పోతినేని నుంచి డబుల్ ఇస్మార్ట్ మూవీ, మాస్ మహారాజ్ మిస్టర్ బచ్చన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా మాస్ ఆడియన్స్ ని మెప్పించాలని ఒకేసారి పోటీ పడ్డాయి. ఈ రెండింటి మధ్యలో చిన్న సినిమాగా ఆయ్ మూవీ రిలీజ్ అయ్యింది. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలని చాలా గట్టిగా ప్రమోట్ చేశారు. ఈ సినిమాల నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్స్ కూడా మాస్ ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

అలా భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్యలో రిలీజ్ అయిన ఈ సినిమాలకి మొదటి రోజు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. ఇక టాక్ కూడా మిక్స్డ్ గా వచ్చింది. పబ్లిక్ నుంచి కూడా అంతంత మాత్రంగానే స్పందన ఉంది. బీ,సి సెంటర్స్ లలో కొంత వరకు ఈ సినిమాలకి ప్రేక్షకాదరణ లభిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీకెండ్ అయ్యాక సినిమా ఎంత వరకు ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించగలుగుతుంది అనేదానిపై సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

కలెక్షన్స్ అయితే ఆ రెండు సినిమాలకి ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఇదే సమయంలో నార్నె నితిన్ హీరోగా వచ్చిన చిన్న సినిమా ఆయ్ కి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇక ఆగష్టు 15న స్టార్ హీరోలు అయితే ప్రేక్షకులకి పెద్దగా కిక్ ఇవ్వలేదని చెప్పాలి. ఆగష్టు 15 వీకెండ్ లో చియాన్ విక్రమ్ తంగలాన్ సినిమాని కూడా ప్రేక్షకులు ఎక్కువగా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో పాటు క్రిటిక్స్ కూడా పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు.

దీంతో తంగలాన్ కూడా ఈ వీకెండ్ విన్నర్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. విక్రమ్ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ తంగలాన్ సినిమాకి వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. నెక్స్ట్ పబ్లిక్ ఫోకస్ అంతా నాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సినిమాపైనే ఉంది. ఈ మూవీ ఆగష్టు 29న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో సరిపోదా శనివారం సినిమాపైనే ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి.

కచ్చితంగా ఈ సినిమాతో ప్రేక్షకులకి నాని మరోసారి మాస్ ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. అలాగే ఈ సినిమా క్లిక్ అయితే నాని ఖాతాలో మరో సారి 100 కోట్లు కలెక్షన్స్ చేరడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఆయన నుంచి వచ్చిన దసరా మూవీ 100+ కోట్ల కలెక్షన్స్ ని మొదటిసారి అందుకుంది. హాయ్ హాన్న మూవీ 70+ కోట్ల దగ్గర ఆగిపోయింది. అయితే సరిపోదా శనివారం సినిమాకి ఉన్న హైప్ చూస్తుంటే భారీ ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. అలాగే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని కూడా అందుకునే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

Tags:    

Similar News