నటాషాతో దిశా పటానీ ప్రియుడు.. ఏంటీ గందరగోళం?
అయితే నటాషా ఈ దీపావళిని ఎక్కడ ఎలా స్పెండ్ చేస్తోంది? అంటే.. తీవ్ర గందరగోళానికి గురి చేసే వీడియో ఒకటి అంతర్జాలంలోకి వచ్చింది.
నటాషా స్టాంకోవిక్.. తన భర్త హార్దిక్ పాండ్యా నుంచి విడిపోయినప్పటి నుండి ఒంటరిగా జీవిస్తోంది. ప్రస్తుతం హిందీ టెలివిజన్ రంగంలో తన కెరీర్ ని పెద్ద స్థాయిలో ప్లాన్ చేస్తోందనేది టాక్. అయితే నటాషా ఈ దీపావళిని ఎక్కడ ఎలా స్పెండ్ చేస్తోంది? అంటే.. తీవ్ర గందరగోళానికి గురి చేసే వీడియో ఒకటి అంతర్జాలంలోకి వచ్చింది.
ఈ వీడియోలో ఫిట్ నెస్ కోచ్, దిశాపటానీ ప్రస్తుత ప్రియుడిగా ప్రచారంలో ఉన్న అలెక్స్ ఇలిక్ తో కలిసి నటాషా డ్యాన్సులు చేస్తోంది. ఆ ఇద్దరూ తమ విలువైన సమయాన్ని గడుపుతున్న వీడియో కొంత గందరగోళానికి దారితీసింది. ఇలిక్ తో కలిసి ఎంతో డిగ్నిఫైడ్ గా కనిపించిన నటాషా డిజైనర్ చీరలో ఎంతో అందంగా కనిపించింది.
నటాషా అందమైన ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ ఇలిక్ తో నర్తిస్తుండగా, ఇలిక్ తన కుర్తా బటన్లను సర్దుబాటు చేసుకుంటూ కనిపించాడు. ఆ ఇద్దరి నడుమా కెమిస్ట్రీ చూశాక .. ఇంత గొప్ప స్నేహానుబంధం ఉందా? అన్న సందేహాలు కలుగక మానవు. అయితే దిశా పటానీతో అత్యంత సన్నిహితంగా ఉండే అలెక్స్ ఇలిక్ ఇప్పుడు నటాషాతో కనిపించడం అభిమానులను కొంత గందరగోళానికి గురి చేసింది. చాలా మంది ఈ పోస్ట్‌కు ప్రతిస్పందిస్తూ దిశాతో ఇలిక్కు ఉన్న సన్నిహిత సంబంధం గురించి ఒకరు ప్రస్తావించారు. కొందరు నెటిజనులు అతడి సంబంధాల గురించి కూడా ఊహాగానాలు సాగించారు. మరికొందరు స్నేహం లో ఆహ్లాదకరమైన ప్రదర్శనను ఆనందించామని అన్నారు. ఎంతో హుందాగా ఉన్న వారి మధ్య సాన్నిహిత్యాన్ని పలువురు పొగిడారు. అద్భుతంగా! మీరు అందంగా ఉన్నారు! అని కూడా కితాబిచ్చారు. ఒకరు `బెస్ట్ బ్రదర్ & సిస్టర్` అని కూడా ఊహించారు.
బాలీవుడ్ సర్కిల్స్‌లో యువకథానాయికలతో ఇలిక్ అలెక్స్ కనెక్షన్ అతడిని నిరంతరం లైమ్ లైట్ లో ఉంచుతుంది. ఇలిక్ సామాజిక జీవితం గురించి తెలుసుకోవాలనే అందరిలో చాలా ఎగ్జయిట్ మెంట్ ఉంది. స్టార్లతో స్నేహంగా పార్టీల్లో కనిపిస్తాడు. ఇలిక్ ముంబైలోని అతిపెద్ద పార్టీలకు హాజరవడమే కాకుండా పరిశ్రమలోని అనేక మంది పెద్ద సెలబ్రిటీలతో కలిసి పనిచేస్తున్నాడు. చాలామంది నటీమణులు, నటులకు అతడు ఫిట్ నెస్ కోచ్ గా సేవలందిస్తున్నాడు.