హిట్ 3 - ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా?

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రీసెంట్ హిట్ చిత్రం “సరిపోదా శనివారం” తో బాక్సాఫీస్ దద్దరిల్లింది.

Update: 2024-10-06 03:48 GMT

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రీసెంట్ హిట్ చిత్రం “సరిపోదా శనివారం” తో బాక్సాఫీస్ దద్దరిల్లింది. ఈ సినిమా తర్వాత నాని నుంచి రాబోయే ప్రాజెక్ట్స్ పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. లైనప్ లో చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలనుతో నాని చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ప్రాంచైజ్ “హిట్ 3” కూడా ఒకటి.

“హిట్” సిరీస్ మొదటి రెండు భాగాలు మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు హిట్ 3 లో నాని హీరోగా కనిపించడం తో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు మరో స్థాయిలో ఉన్నాయి. శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపుతోంది. నాని తన సొంత ప్రొడక్షన్ లోనే ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే, భారీ షూటింగ్ కొనసాగుతున్న క్రమంలో నుంచి వరుస లీక్స్ వచ్చి పడ్డాయి.

అభిమానులకు, మేకర్స్ కు ఈ లీక్స్ కాస్త తలనొప్పిగా మారాయి. సినిమాపై ఉన్న క్రేజ్ ని ఈ లీక్ లు కొంతవరకు తగ్గిస్తున్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు కొన్ని వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడం అభిమానులను, చిత్ర యూనిట్ ను విస్మయానికి గురిచేసింది. ఇప్పుడు మళ్ళీ మూడోసారి మరో వీడియో క్లిప్ లీక్ అవ్వడంతో ఈ సీన్ చాలా సీరియస్ గా తీసుకోవాలని భావిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఈ క్లిప్స్ వైరల్ అవుతుండటంతో, ఫ్యాన్స్ లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. “హిట్ 3” లో ఇలాంటి లీక్ లు సినిమా మొత్తానికి దెబ్బ తీసే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మేకర్స్ ఈ లీక్ లను అరికట్టడానికి మరింత జాగ్రత్తగా ఉండాలని నాని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇకపోతే, “హిట్ 3”లో నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ కు మంచి ఆకర్షణగా నిలవనున్నారట. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సిరీస్ కి అతను ప్రత్యేకమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఇకపోతే, హిట్ 3 లో నాని ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ పాత్రలో ఆయన చూపించబోయే యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. దర్శకుడు శైలేష్ ఈ సినిమాను ఒక సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారని, ఇది క్రైమ్ థ్రిల్లర్ గా ఉన్నప్పటికీ, ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

Tags:    

Similar News