చిన్న‌ప్పుడు స్కూల్ అంటే టెర్ర‌ర్..కానీ మావాడు డిఫ‌రెంట్!

అయితే మునుప‌టిలా ఇప్పుడు పిల్ల‌లు లేరు. చాలా వ‌ర‌కూ గుడ్ గానే క‌నిపిస్తున్నారు.

Update: 2024-08-10 05:26 GMT

బాల్యంలో ఇంటిని, ఆట‌ని వ‌దిలి స్కూల్ కి వెళ్లాలంటే ప్రాణం పోయ‌నంత ప‌నే కొంత మంది పిల్ల‌ల్లో. చాలా మంది పిల్ల‌లు ఆ య‌వ‌సులో స్కూల్ కి వెళ్ల‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ఎంచ‌క్కా ఇంటి ద‌గ్గ‌ర అమ్మ‌తో ఆడుకోవాల‌నిపిస్తుంది. అతి బ‌ల‌వంతం చేసి స్కూల్ తీసుకెళ్లే ప్ర‌య‌త్నం త‌ల్లిదండ్రులు ఏ రేంజ్ లో చేస్తున్నారో? ఇప్ప‌టికీ చూస్తూనే ఉన్నాం. సోష‌ల్ మీడియాలోఅలాంటి వీడియోలు వైర‌ల్ అయిన‌ప్పుడ‌ల్లా ఒక్క‌సారిగా బాల్యంలోకి వెళ్లిపోతాం.

అయితే మునుప‌టిలా ఇప్పుడు పిల్ల‌లు లేరు. చాలా వ‌ర‌కూ గుడ్ గానే క‌నిపిస్తున్నారు. త‌ల్లిదండ్రుల్ని పెద్ద‌గా ఇబ్బంది పెట్ట‌కుండానే స్కూల్ కి వెళ్తున్నారు. తాజాగా నేచుర‌ల్ స్టార్ నాని కుమారుడు జున్ను కూడా గుడ్ బోయ్ అనేసాడు. స్కూల్ కి వెళ్లాలంటే జున్ను ఎంతో ఉత్సాహం చూపిస్తాడుట‌. స్కూల్ లేదంట‌నే బోర్ గా ఫీల‌వుతాడుట‌. అయితే ఇప్పుడు స్కూల్స్ లో వాతావ‌ర‌ణం పూర్తిగా మారింద‌న్నాడు.

చ‌దువు పేరుతో రుద్ద‌డం త‌గ్గింద‌న్నాడు. `మంచి వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తున్నారు. మావాడు అప్పుడే పియానో కూడా నేర్చుకుంటున్నాడు. ఆవ‌య‌సులో ఎంతో ఆస‌క్తి ఉంటే త‌ప్ప పియానో నేర్చుకోమ‌ని టీచ‌ర్లు చెప్ప‌రు. మావాడి స్పీడ్ చూస్తుంటే నా సినిమాకే సంగీతం అందిచేలా ఉన్నాడు. కానీ నేను మావాడు టైప్ కాదు. చిన్న వ‌య‌సులో స్కూల్ కి వెళ్లాలంటే భ‌యంతో ఒణికిపోయేవాడిని.

అదోక పీడ‌క‌ల‌. స్కూల్ సెల‌వు ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూసేవాడిని. మా వాడు నాకు భిన్నంగా స్కూల్ కి ఎప్పుడు వెళ్దామా? అని చూస్తుంటాడు. అక్క‌డ చాలా మంది స్నేహితులున్నారు. చాలా వ్యాప‌కాలు కూడా ఉన్నాయి. స్కేటింగ్ కూడా నేర్చుకుంటున్నాడు` అని అన్నారు.

Tags:    

Similar News