పిక్ టాక్ : ఈ రియల్‌ కపుల్‌ రీల్ కపుల్ అవుతారేమో!

విఘ్నేశ్ శివన్‌ తో సుదీర్ఘ కాలం ప్రేమలో కొనసాగిన నయనతార ఆయన్ని కూడా పెళ్లి చేసుకోవడం అనుమానమే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేశారు.

Update: 2023-10-10 08:30 GMT

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార రెండు సార్లు ప్రేమలో విఫలం అయినా కూడా మూడవ సారి ప్రేమలో విజయాన్ని దక్కించుకుంది. విఘ్నేశ్ శివన్‌ తో సుదీర్ఘ కాలం ప్రేమలో కొనసాగిన నయనతార ఆయన్ని కూడా పెళ్లి చేసుకోవడం అనుమానమే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేశారు. అలా కామెంట్స్ చేసిన వారు ఇప్పుడు ఇలాంటి ఫోటోలు చూసి షాక్‌ అవుతూ ఉంటారు.


నయనతార తన ప్రియుడు విఘ్నేశ్ శివన్‌ తో తన ప్రేమను మరో లెవల్ కి తీసుకు వచ్చి తమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులుగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూనే మరో వైపు ఏమాత్రం తగ్గకుండా ఒకరంటే ఒకరు ప్రాణం అన్నట్లుగా ప్రేమను ఒకరిపై ఒకరు చూపించుకుంటున్నారు.

నయనతార ఒక వైపు హీరోయిన్ గా దూసుకు పోతుంది. కోలీవుడ్‌ లోనే కాకుండా బాలీవుడ్‌ లో కూడా ఈ అమ్మడి జోరు కొనసాగుతుంది. సాధారణంగా సౌత్‌ హీరోయిన్స్ పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌ బై చెప్తారు. పిల్లలు పుట్టాక ఆంటీ పాత్రలు, అక్క పాత్రలు చేసుకోవాల్సిందే. కానీ నయన్‌ మాత్రం ఇంకా లేడీ సూపర్ స్టార్‌ గానే దూసుకు పోతూ ఉంది.

రెగ్యులర్ గా నయన్ మరియు విఘ్నేశ్ శివన్ ల యొక్క రొమాంటిక్ కమ్‌ లవ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా ఈ ఫోటోను ఈ దంపతులు అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలను చూసిన చాలా మంది ఈ రియల్‌ కపుల్‌ సినిమా లో హీరో హీరోయిన్‌ గా నటించి రీల్‌ కపుల్‌ అని కూడా అనిపించుకుంటే బాగుంటుంది కదా అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరి భవిష్యత్తులో వీరిద్దరు హీరో హీరోయిన్ గా సినిమా వచ్చేనా చూడాలి. నయన్‌ హీరోయిన్ గా విఘ్నేశ్ శివన్‌ దర్శకత్వం లో సినిమాలు వచ్చాయి కానీ.. విఘ్నేశ్ హీరోగా సినిమా చేయలేదు. మరి నయన్‌, విఘ్నేశ్ శివన్‌ ల అభిమానుల కోరిక తీరేనా చూడాలి.

Tags:    

Similar News