వెకేష‌న్‌లో న‌య‌న్‌ని ఇలా చూసారా ఎపుడైనా?

నయనతార త‌న హ‌బ్బీతో రొమాంటిక్ గా క‌నిపిస్తున్న ఫోటోలను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. తన భర్తతో క‌లిసి హాంకాంగ్ వీధుల్లో స్వేచ్ఛ‌గా షికారు చేస్తున్నప్పుడు ఒక‌రికొక‌రు చేతులు కలిపి నడుస్తూ కనిపించారు.

Update: 2024-05-30 04:40 GMT

భ‌ర్త విఘ్నేష్‌తో న‌య‌న్ రొమాంటిక్ లైఫ్ కి సంబంధించిన ప్ర‌తిదీ బ‌హిరంగ‌మే. ఎందులోనూ దాప‌రికం లేదు. త‌న ఇన్ స్టాలో రొమాంటిక్ లైఫ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోల‌ను న‌య‌న‌తార రివీల్ చేస్తుంది. కానీ ఈసారి మునుప‌టి కంటే చిల్లింగ్ గా క‌నిపిస్తోంది ఈ జంట‌. రొమాన్స్ రొమాన్స్ రొమాన్స్... న‌య‌న్ త‌గ్గేదేలే అంటూ చెల‌రేగుతోంది.

 

సూపర్‌స్టార్ నయనతార తన భర్త, దర్శ‌క‌ నిర్మాత విఘ్నేష్ శివన్‌తో కలిసి విదేశీ విహార‌యాత్ర‌ను ఆస్వాధిస్తోంది. హాంకాంగ్ యాత్ర నుంచి చాలా విజువ‌ల్స్ ఇప్ప‌టికే వెబ్ ని ముంచెత్తుతున్నాయి. ఈ అంద‌మైన జంట ఒకరితో ఒకరు విలువైన సమయాన్ని గడుపుతున్నారు. ఓవైపు కఠినమైన షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈ జంట కొద్దిరోజుల పాటు సెల‌వులు తీసుకున్నారు. హాంకాంగ్ లో వారి గది నుండి అత్యంత అద్భుతమైన న‌గ‌ర‌ వీక్షణ స్ప‌ష్ఠంగా అర్థ‌మ‌వుతోంది. ఆకాశహర్మ్యంలోంచి ఈ జంట సుదూర తీరాల‌ను వీక్షిస్తోంది. షికార్ల ప‌రంగా త‌గ్గేదేలే అంటున్నారు ఈ హాట్ క‌పుల్.

 

నయనతార త‌న హ‌బ్బీతో రొమాంటిక్ గా క‌నిపిస్తున్న ఫోటోలను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. తన భర్తతో క‌లిసి హాంకాంగ్ వీధుల్లో స్వేచ్ఛ‌గా షికారు చేస్తున్నప్పుడు ఒక‌రికొక‌రు చేతులు కలిపి నడుస్తూ కనిపించారు. కొన్ని ఫోటోల్లో ఈ జంట బహిరంగంగా ఒక‌రిపై ఒక‌రు ప్రేమ‌ను ప్రదర్శించ‌డం..అలాగే నగర సౌంద‌ర్యాన్ని అన్వేషించిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. నయనతార గ్రాఫిక్-ప్రింటెడ్ బ్లూ స్వెట్‌షర్ట్, బ్లాక్ షార్ట్స్ లో క‌నిపించ‌గా.. విఘ్నేష్ గ్రాఫిక్-ప్రింటెడ్ బ్లాక్ టీ-షర్ట్ - గ్రే ప్యాంట్ ధరించాడు.

 

 

 

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. నయనతార తదుపరి మలయాళ చిత్రం 'డియర్ స్టూడెంట్స్'లో కనిపించనుంది. ఈ చిత్రం లో మ‌రోసారి త‌న‌ 'లవ్ యాక్షన్ డ్రామా' సహనటుడు నివిన్ పౌలీతో న‌యన్ జతకట్టింది. న‌య‌న‌తార కేవ‌లం న‌టి మాత్ర‌మే కాదు.. ఎంట‌ర్ ప్రెన్యూర్ కూడా. చర్మ సంరక్షణ, స్త్రీ పరిశుభ్రత వంటి కాన్సెప్ట్ బేస్డ్ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి విజయవంతమైన వ్యాపారవేత్తగా న‌య‌న్ కొన‌సాగుతోంది.

Tags:    

Similar News