నయనతార ప్రచారం స్ట్రాటజీ బాగుందే!
తాజాగా ప్రచారంలో భాగంగా కొత్త రకమైన స్ట్రాటజీని మొదలు పెట్టింది. సమంతకు 9 స్కిన్ నుంచి ఫేస్ క్రీమ్ ప్రాడక్ట్స్ ను పంపించింది నయన్.
నయనతార తాను నటించిన ఏ సినిమా ప్రచారానికి హాజరు కాదన్న సంగతి తెలిసిందే. అలాగే సోషల్ మీడియాలో కూడా ఆయా సినిమాల గురించి కనీసం పోస్ట్ కూడా పెట్టదు. తాను నటించని సినిమాకి సంబంధించి షూటింగ్ పూర్తయితే..మిగతా ఏ విషయాలతోనూ తనకు సంబంధ ఉండదు. అగ్రిమెంట్ లో ఆ విషయం ముందే ఉంటుంది. ఈ విషయంలో నయనతార తీరుపై అసంతృప్తి ఉన్నా! ఓపెన్ గా చెప్పలేని వారెంతో మంది. చిరంజీవి..షారుక్ ఖాన్ సినిమాలైనా అంతే.
నయనతార ముందు ఎంతటి స్టార్ అయినా సరే! నో వే అనేస్తుంది. అయితే అమ్మడు తన సొంత బిజినెస్ ని మాత్రం చాలా చక్కగా ప్రమోట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే '9 స్కిన్' అనే కాస్మొటిక్స్ బిజినెస్ ని ప్రారంభించింది. దానికి సంబంధించి మీడియాకి ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. సోషల్ మీడియాలో వాటి గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఖాళీ సమయం దొరికితే తన బ్రాండ్లను మార్కెట్లోకి ఎలా ఎక్కించాలని ఆలోచిస్తుంది.
దీనిలో భాగంగా సోషల్ మీడియాలో ఏమాధ్యమాన్ని విడిచిపెట్టడం లేదు. అన్నిరకాలుగా ప్రచారం చేస్తుం ది. తాజాగా ప్రచారంలో భాగంగా కొత్త రకమైన స్ట్రాటజీని మొదలు పెట్టింది. సమంతకు 9 స్కిన్ నుంచి ఫేస్ క్రీమ్ ప్రాడక్ట్స్ ను పంపించింది నయన్. ఈ విషయాన్ని ఇన్స్టా ద్వారా సమంత వెల్లడించింది. ఈ ప్రాడక్ట్స్ ని వాడటానికి తాను ఆసక్తిగా ఉన్నానని తెలిపింది. 9 స్కిన్ కంపెనీకి ఆల్ ది బెస్ట్ చెప్పింది.
మరి ఇప్పటి వరకూ కేవలం సమంతకే ఇలా పంపింది. ఇంకా చాలా మంది హీరోయిన్లకు ఈ ఉత్పత్తుల్ని పంపిందా? అన్నది ఆసక్తికరం. పంపించిన ప్రతీ ఒక్కరు సమంతలా సోషల్ మీడియాలో చెప్పాల్సిన పనిలేదు.
సినిమా వాళ్లు మినహా తన బెస్ట్ ప్రెండ్స్ ఎవరికీ పంపిచినా ఎలాంటి పబ్లిసిటీ రాదు. కేవలం సినిమా వాళ్లు తన స్నేహితులైతే సమంత లా వాటి గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేస్తే కోట్ల రూపాయల ఉచిత పబ్లిసిటీ లభిస్తుంది. అంతేగా అంతేగా..!