లేడీ సూపర్‌ స్టార్‌ ఐదేళ్ల తర్వాత అతడితో..!

లేడీ సూపర్ స్టార్‌ నయనతార పెళ్లి, పిల్లల తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూనే ఉంది

Update: 2024-07-16 06:24 GMT

లేడీ సూపర్ స్టార్‌ నయనతార పెళ్లి, పిల్లల తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూనే ఉంది. షూటింగ్‌ దశలో ఉన్నవి, చర్చల దశలో ఉన్నవి మొత్తం కలిపి నయనతార చేతిలో దాదాపు పది సినిమాలు ఉన్నట్లు తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

నయనతార సినిమాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే పది సినిమాలు ఆమె కిటీ లో ఉన్నప్పటికీ కొత్తగా మరోటి చేరబోతుంది. అయిదు సంవత్సరాల క్రితం సర్జున్‌ కేఎమ్‌ దర్శకత్వంలో నయనతార 'ఐరా' అనే సినిమాను చేసింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు నయన్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది.

ఐరా సినిమా నయనతార వరుస లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేసేందుకు ప్రోత్సాహంగా నిలిచింది అనేది తమిళ సినీ విశ్లేషకుల అభిప్రాయం. అలాంటి మంచి సినిమాను ఇచ్చిన సర్జున్ దర్శకత్వంలో మరోసారి సినిమాను చేసేందుకు గాను నయనతార రెడీ అవుతుందట.

వీరిద్దరి కాంబోలో సినిమా కోసం సినీ విమర్శకుడు బరద్వాజ్ రంగన్ స్క్రిప్ట్‌ ను రాసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే నయన్‌ కి స్టోరీ లైన్ నచ్చడంతో డేట్స్ కూడా ఇచ్చేసిందని, స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి అవ్వడమే ఆలస్యం షూటింగ్‌ కి వెళ్లాలని దర్శకుడు భావిస్తున్నాడు.

నయనతార ప్రధానంగా నటిస్తున్న సినిమాల్లో తని ఒరువన్‌ సీక్వెల్‌ ఒకటి కాగా, మరి కొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌ లు లైన్ లో ఉన్నాయి. రాబోయే రెండేళ్ల కాలంలో నయనతార నుంచి డజను సినిమాలు వస్తాయని ఆమె సన్నిహితులు మరియు తమిళ సినీ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

Tags:    

Similar News