NBK109 ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతంటే?

ఓవరాల్ గా 75 కోట్ల వరకు థీయాట్రికల్ బిజినెస్ ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాలలో జరిగినట్లు తెలుస్తోంది.

Update: 2024-10-22 04:40 GMT

నందమూరి నటసింహం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో 'NBK109' మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ చివరి దశలో ఉంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. డేట్ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. బాలయ్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వరుసగా హ్యాట్రిక్ విజయాలతో ఉన్న బాలయ్య నుంచి మరో మాస్ హిట్ ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కచ్చితంగా ఈ 'NBK109' మూవీ అలనాటి సూపర్ సక్సెస్ ని ఇస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ ఇప్పటికే కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో 35-40 రేషియోతో 'NBK109' బిజినెస్ ని కంప్లీట్ చేసారంట. ఓవరాల్ గా 75 కోట్ల వరకు థీయాట్రికల్ బిజినెస్ ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాలలో జరిగినట్లు తెలుస్తోంది.

దీంతో పాటు వరల్డ్ వైడ్ గా 90 కోట్ల వరకు బిజినెస్ అయ్యిందనే మాట వినిపిస్తోంది. అంటే ఈ సినిమా 100 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తే సూపర్ హిట్ బొమ్మగా మారుతుంది. ఈ సినిమా సక్సెస్ అయితే బాలయ్య 100 కోట్ల షేర్ క్లబ్ లో జాయిన్ అవుతాడని అందరూ భావిస్తున్నారు. బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ ఈ సినిమాపై జరిగిందని అర్ధమవుతోంది.

'NBK109' చిత్రంలో బాబీ డియోల్ ప్రతి నాయకుడిగా నటించారు. ఊర్వశీ రౌతేలా, ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. పవర్ ఫుల్ మాస్ కథాశంతో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. 'వాల్తేరు వీరయ్య' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ నుంచి వస్తోన్న సినిమా కావడం మూవీపైన అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే బాలయ్య రీసెంట్ గా 'అఖండ 2' సినిమాని ప్రారంభించారు.

ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి మొదలవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే బాలయ్య షూటింగ్ లో ఆలస్యంగా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. 'అఖండ 2' ఏకంగా 150 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలయ్య కూతురు తేజస్విని కూడా ఈ సినిమాకు సహా నిర్మాతగా ఉన్నారు.

Tags:    

Similar News