అన్ స్టాపబుల్ సీజన్ 3… ఫస్ట్ గెస్ట్ ఎవరంటే?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో ప్రసారం అయిన అన్ స్టాపబుల్ సీజన్స్ 1, 2 ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే.

Update: 2024-09-30 05:35 GMT

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో ప్రసారం అయిన అన్ స్టాపబుల్ సీజన్స్ 1, 2 ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 3కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దసరాకి అన్ స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ ప్రారంభం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలయ్య కూడా సీజన్ 3 పైన చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది స్టార్ సెలబ్రెటీలని గెస్ట్ లుగా పిలవబోతున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే సీజన్ 3కి సంబందించిన ఇంటరెస్టింగ్ అప్డేట్ తెరపైకి వచ్చింది. ఈ సీజన్ లో ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా దుల్కర్ సల్మాన్ పార్టిసిపేట్ చేయబోతున్నాడంట. దుల్కర్ నటించిన ‘లక్కీ భాస్కర్’ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటించింది. ఇక సినిమా ప్రమోషన్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ దసరా నుంచి స్టార్ట్ చేయనుంది. ప్రమోషన్స్ లో భాగంగా అన్ స్టాపబుల్ షో కి దుల్కర్ సల్మాన్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు.

ఇప్పటికే దుల్కర్ సల్మాన్ తో అన్ స్టాపబుల్ సీజన్ 3 కోసం ఫస్ట్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారంట. ఈ ఎపిసోడ్ లో దుల్కర్ సల్మాన్ తో పాటు నిర్మాత నాగవంశీ, డైరెక్టర్ వెంకీ అట్లూరి పాల్గొన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఈ ముగ్గురిని వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విశేషాలు కూడా అడిగి తెలుసుకున్నారంట. సితార ఎంటర్టైనర్ బాలయ్యతో NBK109 సినిమాని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య, నిర్మాత నాగవంశీ మధ్య మంది బాండింగ్ ఉందని తెలుస్తోంది.

కచ్చితంగా ఈ ఎపిసోడ్ ఇంటరెస్టింగ్ గా ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఇక సీజన్ 3లో మెగాస్టార్ చిరంజీవి కూడా గెస్ట్ గా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. బాలయ్య హోస్ట్ గా మెగాస్టార్ ని ఇంటర్వ్యూ చేస్తే ఆ ఎపిసోడ్ కి రికార్డ్ స్థాయిలో వ్యూవర్ షిప్ వస్తుందని భావిస్తున్నారు. అన్ స్టాపబుల్ రెండు సీజన్స్ తరహాలో ఈ మూడో సీజన్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.

ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘NBK109’ సినిమాని బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ 2’ ని కూడా బాలయ్య ఇదే ఏడాది మొదలుపెట్టబోతున్నాడు.

Tags:    

Similar News