డిసెంబర్ నుంచి వారసుడు బరిలోకి!
నటసింహ బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారైన సంగతి తెలిసిందే.
నటసింహ బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారైన సంగతి తెలిసిందే. ఇదే సినిమాతో బాలయ్య చిన్న కుమార్తె తేజస్వీని నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. సుధాకర్ చెరుకూరి తో కలిసి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవం ఎప్పుడు? అన్నది కొన్నిరోజులుగా అభిమానుల మధ్య నలుగుతోంది. దసరా సందర్భంగా లాచ్ అయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.
సినిమా ప్రారంభోత్సవానికి దసరా మంచి సమయం అయిన నేపత్యంలో బాలయ్య మంచి గడియలు చూసుకుని అప్పుడు ముహూర్తం పెట్టి ఉంటారని అంతా గెస్ చేస్తున్నారు. అయితే ఈసినిమా ప్రారంభోత్సవం గురించి బాలయ్య ఐఫా అవార్డుల కార్యక్రమంలో అప్ డేట్ ఇచ్చారు. డిసెంబర్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందన్నారు. అంటే మోక్షజ్ఞ డిసెంబర్ నుంచి బరిలోకి దిగుతున్నాడని తేలిపోయింది.
ఇప్పటికే మోక్షజ్ఞ లుక్ పరంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. స్లిమ్ లుక్ లో చాక్లెట్ బోయ్ లా ఉన్నాడు. మోక్ష అమ్మాయిల గుండెల్లో రాకుమారుడు అయ్యేలా ఉన్నాడనే ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఈ సినిమా కథ ఆధ్యాత్మికతను ఆధారంగా చేసుకుని ప్రశాంత్ వర్మ రాసుకున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియాకి ఈసినిమా కనెక్ట్ అవ్వాలంటే? అలాంటి అంశం తప్పనిసరి అని ఇప్పటికే రెండు సినిమాలు రుజువు చేసాయి.
కార్తికేయ-2, హనుమాన్ సినిమాలు పాన్ ఇండియా అలా సక్సెస్ అందుకున్నవే. బాలయ్య అఖండ కూడా హిదుత్వం కాన్సెప్ట్ కావడంతో టీవీ ద్వారా నార్త్ ఆడియన్స్ బాగా రీచ్ అయింది. అందుకే ప్రశాంత్ వర్మ ఆ లాజిక్ ని విడిచి పెట్టడం లేదు. ఆపాయింట్ ని బేస్ చేసుకునే తన యూనివర్శ్ నుంచి రిలీజ్ అవుతున్న చిత్రంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.