బాల‌య్య # 110..బ‌డ్జెట్ దిమ్మ‌తిరిగిపోతుందే!

అటుపై 110 కోసం బోయ‌పాటి లైన్ లోకి వ‌చ్చేసాడు. ఈ కాంబో గురించి డౌటే లేదు. హిట్ తప్ప మ‌రో ఆలోచ‌న లేకుండా ప‌నిచేస్తారు.

Update: 2024-05-19 11:30 GMT

న‌ట‌సింహ బాల‌కృష్ణ 110వ చిత్రం బ‌డ్జెట్ ఫిక్సైందా? బాల‌య్య కెరీర్ లో తొలి భారీ బ‌డ్జెట్ చిత్రం ఇదే అవుతుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. ప్ర‌స్తుతం బాల‌య్య పుల్ స్వింగ్ లో ఉన్నారు. వ‌రుస విజ‌యాల‌తో హ్యాట్రిక్ నమోదు చేసి డ‌బుల్ హ్యాట్రిక్ పై క‌న్నేసారు. 109వ చిత్రాన్ని బాబి ద‌ర్శ‌క‌త్వంలో ప‌ట్టాలెక్కించారు. ఆ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. అది హిట్ అయితే వ‌రుస‌గా ఐద‌వ విజ‌యంగా న‌మోద‌వుతుంది. అటుపై 110 కోసం బోయ‌పాటి లైన్ లోకి వ‌చ్చేసాడు. ఈ కాంబో గురించి డౌటే లేదు. హిట్ తప్ప మ‌రో ఆలోచ‌న లేకుండా ప‌నిచేస్తారు.

ఈ నేప‌థ్యంలో బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మించే ప్లాన్ లో క‌నిపిస్తున్నారు. ఈ చిత్రం 14 రీల్స్ సంస్థ ఏకంగా 150 కోట్లు బ‌డ్జెట్ కేటాయిస్తుందిట‌. బాల‌య్య వ‌రుస స‌క్సెస్ లు..అత‌డి మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఎక్క‌డా త‌గ్గేదేలే అంటూ స‌ద‌రు సంస్థ ముందుకొస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కూ బాల‌య్య సినిమాల బ‌డ్జెట్ అంటే 50-60 కోట్ల లోపే క‌నిపిస్తుంది. 100 కోట్ల‌తో బాల‌య్య సినిమా చేసింది లేదు. బాల‌య్య మార్కెట్ ని బేస్ చేసుకునే సినిమాలు చేసేవారు.

అద‌న‌పు ఖ‌ర్చుకి బాల‌య్య కూడా ముందుకొచ్చే వారు కాదు. కానీ వ‌రుస విజ‌యాల‌తో బాల‌య్య మార్కెట్ మునుప‌టి కంటే అంత‌కంత‌కు రెట్టింపు అయింది. అన్ స్టాప‌బుల్ షో కూడా బాల‌య్య ఇమేజ్ ని రెట్టింపు చేసింది. వ‌రుస‌గా వంద కోట్ల సినిమాలు మూడు ఉన్నాయి. `అఖండ 200` కోట్లు..`వీర‌సింహారెడ్డి` 134 కోట్లు..`భ‌గ‌వంత్ కేస‌రి` 100 కోట్ల వ‌సూళ్ల‌తో బాల‌య్య కెరీర్ లో భారీ వ‌సూళ్ల చిత్రాలుగా నిలిచాయి. ఈ నేప‌థ్యంలో నే 110వ సినిమా కోసం 150 కోట్లు కేటాయిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇది పాన్ ఇండియాలో రిలీజ్ చేయ‌బోతున్నారు. అఖండ‌తో బాల‌య్య పాన్ ఇండియాకి రీచ్ అయ్యారు. థియేట్రిక‌ల్ రిలీజ్ పాన్ ఇండియాలో లేక‌పోయినా టెలివిజ‌న డ‌బ్బింగ్ వెర్ష‌న్ లో నార్త్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌ధానంగా హిందుత్వం కాన్సెప్ట్ అక్క‌డ ఆడియ‌న్స్ క‌నెక్ట్ అవ్వ‌డంతోనే ఇది సాధ్య‌మైంది. ఆ న‌మ్మ‌కంతోనే 14 రీల్స్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తోంది.

Tags:    

Similar News