మారేడుమిల్లి అందాల్లోనూ బాలయ్య దబిడి దిబిడే!
అనీల్ రావిపూడి మార్క్ ఎంటర్ టైనింగ్ ఏమాత్రం మిస్ కాకుండా బాలయ్య శైలి యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ క్లైమాక్స్ చేరుకుంది. ఇటీవలే హైదరాబాద్ లో ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తిచేసారు. ప్రత్యేకంగా వేసిన ఓ భారీ సెట్ లో బాలయ్యపై హై ఓల్డేజ్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. స్టంట్ మాస్టర్ వెంకట్ నేతృత్వంలో ఈ సన్నివేశాలు ముగించారు. యాక్షన్ షెడ్యూల్స్ లో ఇదే లాంగ్ షెడ్యూల్ గా ఇప్పటివరకూ చెప్పుకున్నాం.
అయితే ఈ యాక్షన్ ఇంకా పూర్తికాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ మారేడు మిల్లి అందాల్లో జరుగుతోంది. అక్కడ కూడా యాక్షన్ సన్నివేశాలే చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. మరో వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందిట.
ఇందులో బాలయ్య సహా ప్రధాన తారాగణమంతా పాల్గొంటుంది. మారేడుమిల్లి పచ్చని అందాలు.. సెలయేర్టు..కొండగుట్టల్లో ఈ పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి సుందరమైన ప్రాంతంలో బాలయ్య యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం ఇదే తొలిసారి.
సినిమాలో ఈ సన్నివేశాలు ప్రత్యక ఆకర్షణగా నిలుస్తాయని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే రామోజీ ఫిలింసిటీలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందట. మరి ఈ షెడ్యూల్ ప్రత్యేకత ఏంటి? అన్నది తెలియాలి.
అనీల్ రావిపూడి మార్క్ ఎంటర్ టైనింగ్ ఏమాత్రం మిస్ కాకుండా బాలయ్య శైలి యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. బాలయ్యపై షూట్ చేసే యాక్షన్ సన్నివేశాలకు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని...కొన్ని సాహసోపేతమైన సన్నివేశాల్లోనూ నటసింహం నటిస్తుందని తెలుస్తోంది.
షూట్ లో భాగంగా పెద్ద ఎత్తున ఫైటర్లు పాల్గొంటున్నారుట. ఇందులో బాలయ్యకి జోడీగా చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే బాలయ్య సోదరి పాత్రలో శ్రీలీల నటిస్తుంది. అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. అన్ని పనలు పూర్తిచేసి అక్టోబర్ 19న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్దం చేస్తున్నారు.