ఫ్యాన్స్ ని ఇలా నిరుత్సాహపరిస్తే ఎలా?
పిక్ ని బ్లాక్ అండ్ వైట్ లో షేర్ చేసినా వయసు మాత్రం స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ ఫోటోని ఉద్దేశించి ఓ కామెంట్ పోస్ట్ చేసింది.' ఇలా లేవలేదు'అని ఓ ఎమోజీని పోస్ట్ చేసింది.
బాలీవుడ్ సంచలనం నేహా ధూఫియా వేగం ఒక్కసారిగా తగ్గింది. నాలుగేళ్ల క్రితం వరకూ జెట్ స్పీడ్ లో కెరీర్ సాగించిన 43 బ్యూటీ! ఇప్పుడు పూర్తిగా డెడ్ స్లో అయింది. 2018 నుంచి ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేసుకుంటూ వచ్చింది. గత ఏడాది 'ఏ థర్స్ డే' అనే సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఆ తర్వాత నేహా నుంచి ఎలాంటి అప్ డేట్ కూడా లేదు. టెలివిజన్ షోస్ లో కూడా ఎక్కడా కనిపించలేదు.
అప్పుడడప్పుడు ఇన్ స్టాలో అభిమానులకు టచ్ లోకి రావడం తప్ప సినిమాల పరంగా మ్యాకప్ వేసుకుని ప్రేక్షకుల్ని అలరించింది లేదు. ఏడాది కాలంగా సోషల్ మీడియాలో సైతం పెద్దగా కనిపించలేదు. దీంతో బాలీవుడ్ మీడియాలో సైతం నేహా ఏమైపోయింది? అన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. బాలీవుడ్ లో అవకా శాలు రాక నటించలేదా? నటనపై ఆసక్తి సన్నగిల్లి సైలెంట్ గా ఉందా? అన్న ప్రచారం సాగింది.
కానీ వేటికి నేహా నుంచి సమాధానం మాత్రం లేదు. సోషల్ మీడియాలో వచ్చిన ఏ రకమైన ప్రచారాన్ని అమ్మడు ఖండించింది లేదు. దీంతో సినిమా అనే ప్రపంచానికి చాలా దూరంగా ఉంది అందుకే ఇలా మౌనం వహిస్తుంది అన్న విషయం నెటి జనులకు అర్దమైంది. తాజాగా నేహా ధూపియా ఓ కొత్త ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈపిక్ లో నేహా వయసు స్పష్టగా కనిపిస్తుంది. నలభై ఏళ్ల ముదురు భామ కి తల కూడా నెరిసిసోయింది.
పిక్ ని బ్లాక్ అండ్ వైట్ లో షేర్ చేసినా వయసు మాత్రం స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ ఫోటోని ఉద్దేశించి ఓ కామెంట్ పోస్ట్ చేసింది.' ఇలా లేవలేదు'అని ఓ ఎమోజీని పోస్ట్ చేసింది. అంటే? తానెంతో యాక్టివ్ గా ఉన్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేహా పోస్ట్ పై అభిమా నులు అంతే ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఈ పిక్ నిజంగానే అభిమా నుల్ని నిరుత్సాహ పరిచేది? అంటూ ఓ నెటి జనుడు కామెంట్ చేయడం ఇంట్రెస్టింగ్.