పాపం రాధిక ను విలన్ చేశారు, కానీ..!
మెహబూబా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శెట్టి
మెహబూబా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శెట్టి. ఆ సినిమా నిరాశ పరిచినా కూడా వెంటనే గల్లీ రౌడీ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. టాలీవుడ్ లో రాణించడం కష్టమే అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా డీజే టిల్లు తో హిట్ దక్కించుకుంది.
డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్రలో నటించిన నేహా శెట్టికి మంచి మార్కులు పడ్డాయి. అందంతో పాటు అభినయం తో మెప్పించింది. సినిమా విడుదల అయ్యి చాలా కాలం అయినా కూడా ఇంకా ప్రేక్షకులు రాధిక... రాధిక అంటూ తెగ ఊగిపోతూనే ఉన్నారు.
ఇటీవల వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాలో కూడా నేహా శెట్టి నటించిన విషయం తెల్సిందే. మొత్తానికి నేహా శెట్టి కి మంచి ఆఫర్లు దక్కుతున్నాయి. అయితే రాధిక అనే పాత్రను చాలా మంది నెగిటివ్ గా చూస్తున్నారు. అబ్బాయిలను మోసం చేసే వారిని రాధిక అంటూ సోషల్ మీడియా ద్వారా అమ్మాయిల గురించి ట్రోల్స్ చేయడం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో నేహా శెట్టి తన తాజా సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా ప్రమోషన్ లో భాగంగా రాధిక పాత్ర గురించి స్పందించింది. చాలా మంది రాధిక ను నెగటివ్ క్యారెక్టర్ గా చూస్తున్నారు. ఆ పాత్రకు మరీ ఇంత నెగిటివిటీ వస్తుందని నేను అనుకోలేదు.
ఆ పాత్ర విషయంలో చాలా సన్నని గీత ఒకటి ఉంది. టిల్లూ పై ప్రేమ విషయంలో రాధిక ను అనుమానించడానికి లేదు. ఆమె కొన్ని కారణాల వల్ల చెడ్డ వ్యక్తులతో స్నేహం చేయాల్సి వచ్చిందని, రాధిక మంచి వ్యక్తి అన్నట్లుగా నేహా శెట్టి చెప్పే ప్రయత్నం చేసింది. మొత్తానికి రాధిక పాత్ర ను పాజిటివ్ చేసేందుకు నేహా శెట్టి తెగ ప్రయత్నిస్తుంది.