'జైల‌ర్' కి సీక్వెల్.. ర‌జ‌నీతో పాటు విజ‌య్!

భారీ అంచ‌నాల మ‌ధ్య ఇటీవ‌ల రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు వ‌సూళ్ల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే

Update: 2023-08-17 04:34 GMT

తెర‌పై సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ క‌నిపిస్తేనే ఓ విధ్వంసం.. ఆయ‌న‌తో పాటు మాలీవుడ్ స్టార్ మోహ‌న్ లాల్..శాండిల్ వుడ్ సంచ‌ల‌నం శివ‌రాజ్ కుమార్ క‌నిపిస్తే ఎలా ఉంటుందో? 'జైల‌ర్' రుచి చూపించింది. భారీ అంచ‌నాల మ‌ధ్య ఇటీవ‌ల రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు వ‌సూళ్ల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. 'బీస్ట్' తో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కున్న ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ 'జైల‌ర్' స‌క్సెస్ తో వాట‌న్నింటిని తుడిచి పెట్టేసాడు.

త‌మిళ్..తెలుగులో భారీ విజ‌యం సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ నేప‌థ్యంలో జైల‌ర్ కి సీక్వెల్ కి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలిసింది. సూపర్ స్టార్ ర‌జనీకాంత్ తో పాటు కోలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ విజ‌య్ ని కూడా రంగంలోకి దించుతున్న‌ట్లు వినిపిస్తుంది. ఇద్ద‌రి ఇమేజ్ కి త‌గ్గ‌ట్టు సీక్వెల్ స్టోరి సిద్దం చేస్తే బాగుంటుంది! అన్న ఆలోచ‌న‌తో దిలీప్ ముందుకు క‌దులుతున్న‌ట్లు కోలీవుడ్ మీడియా లో వార్త‌లొస్తున్నాయి.

'జైల‌ర్' ఫ‌లితం విష‌యంలో విజ‌య్ సంతోషం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. సినిమా హిట్ అని మొద‌టి మెసెజ్ విజ‌య్ నుంచే వ‌చ్చింది. ఆ త‌ర్వాత దిలీప్ బీస్ట్ ఫెయిలైన వైనాన్ని గుర్తు చేసారు. దీంతో విజ‌య్ కూడా పాజిటివ్ గా స్పందించారు. 'మంచి ప్ర‌య‌త్నం చేసాం. అంద‌రికీ క‌నెక్ట్ అవ్వ‌లేదు. త్వ‌ర‌లోనే సినిమా చేద్దాం అని ప్రామిస్ చేసారు. ఈ నేప‌థ్యంలో దిలీప్ లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఈ నేప‌థ్యంలో 'జైల‌ర్' సీక్వెల్ తెర‌పైకి రావ‌డం విశేషం.

ప్ర‌స్తుతం టీమ్ 'జైల‌ర్' విజ‌యాన్ని ఆస్వాది స్తుంది. స‌క్సెస్ సంద‌ర్భంగా ర‌జనీ హిమాల‌యాల‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుని తిరిగి కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. అలాగే విజ‌య్ -లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో 'లియో' లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న ఆ సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నారు.

Tags:    

Similar News