నెట్ ప్లిక్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుందా!
హిట్ సినిమాని థియేటర్లోని..ఓటీటీలోనూ రెండు చోట్ల అదరిస్తారు. విజయంతమైన సినిమా కాబట్టి కొత్తవారి తోపాటు, రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు
హిట్ సినిమాని థియేటర్లోని..ఓటీటీలోనూ రెండు చోట్ల అదరిస్తారు. విజయంతమైన సినిమా కాబట్టి కొత్తవారి తోపాటు, రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు. ఆ రకంగా హిట్ సినిమా ఓటీటీలోనూ సేఫ్ జోన్ లో ఉంటుంది. మరి ప్లాప్ అయిన సినిమా పరిస్థితి ఏంటి? అలా ప్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో ట్రెండింగ్ లో నిలిచిన సినిమాలున్నాయి. థియేటర్లో ఫెయిలైన కొన్ని సినిమాలు ఓటీటీలోనూ బాగానే ఆదరణ దక్కించుకు న్నాయి. ఓటీటీలో వరల్డ్ వైడ్ చూసే అవకాశం ఉంది కాబట్టి సినిమా లో కాస్త విషయం ఉన్న ఎక్కడో ఓచోట కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
అయితే ఇటీవలే నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అయిన 'భోళా శంకర్'.. 'రామబాణం' లాంటి సినిమాలు చూసి సబ్ స్క్రైబర్లు ఎందుకు ఇలాంటి సినిమాలు చూసామా? అని ఫీలవుతున్నారుట. థియేటర్లో ఈ రెండు సినిమాలు ఘోరంగా ఫెయిలయ్యాయి. అదే ఊపులో ఓటీటీలో కూడా రిలీజ్ చేస్తే కనీస ఆదరణ కూడా ఉండదని గ్రహించిన టీమ్ చాలా గ్యాప్ తర్వాత ఓటీటీలో అందుబాటులోకి తెచ్చారు. ఇలా గ్యాప్ తీసుకుంటే థియేటర్ అనుభవాన్ని కొంతైనా మర్చిపోవడానికి అవకాశం ఉంటుందనే సదరు యాజమాన్యంలో అలా చేసింది.
కానీ వాళ్ల ప్రయత్నాలేవి ఫలించలేదు.థియేటర్లో ఏతరహా విమర్శలు ఎదుర్కున్నాయో ఓటీటీ రిలీజ్ లోనూ అక్షింతలు తప్పలేదు. అనవసరంగా సినిమా కోసం సమయం వృద్ధా చేసుకున్నామని ఫీడ్ బ్యాక్ ఇచ్చారంటే సన్నివేశం ఎలా ఉందో అద్దం పడుతుంది. ఇలాంటి సినిమాల వల్ల ఓటీటీ రిపిటేషన్ పై కూడా ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వరుణ్ తేజ్గం నటించిన 'గాండీవధారి అర్జున' సెప్టెంబర్ 24 న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా కూడా థియేటర్ రిలీజ్ లో ఘోరమైన పరాజయం చెందిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తారు గత చిత్రం 'ది ఘోస్ట్' కంటే దారుణంగా ఉందని చాలామంది భావించారు. ఈ నిర్మాతలు మరియు బయ్యర్లు 20 కోట్లకు పైగా నష్టపోయారు. మరి ఓటీటీ ప్రేక్షకులు ఈ చిత్రానికి ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రేక్షకులు యాక్సప్ట్ చేస్తే పర్వాలేదు. లేదంటే బ్యాక్ టూ బ్యాక్ ట్రిపుల్ ప్లాప్ బోనంజా తప్పదు.