పుష్పకు ఇలా.. కల్కికు అలా.. ఝలక్ ఎఫెక్ట్!

రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో దూసుకుపోతున్న పుష్ప-2.. నార్త్ లో ప్రభంజనమే సృష్టిస్తోంది. రిలీజ్ కు ముందు ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలను అందుకుని ఓ రేంజ్ లో సందడి చేస్తోంది.

Update: 2024-12-22 09:30 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప-2: ది రూల్ మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదలైన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో దూసుకుపోతున్న పుష్ప-2.. నార్త్ లో ప్రభంజనమే సృష్టిస్తోంది. రిలీజ్ కు ముందు ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలను అందుకుని ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. విడుదలైన 15 రోజుల్లోనే రూ.632 కోట్లు కలెక్ట్‌ చేసి 100 ఏళ్ల బాలీవుడ్‌ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది పుష్ప-2 చిత్రం.

ప్రపంచ వ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా రాబట్టిన పుష్ప-2.. నార్త్ లో మాత్రం నెవ్వర్ బిఫోర్ అనేలా రాణిస్తోంది. అయితే బీ టౌన్ వెర్షన్ వసూళ్లు రూ.632 కోట్లుగా మేకర్స్ చెబుతుండగా.. కొన్ని నివేదికల్లో మాత్రం రూ.562 కోట్లుగా ఉంది. దీంతో మేకర్స్ 70 కోట్ల వేరియేషన్ కనిపిస్తుందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

3-5 శాతం వేరియేషన్ ఓకే కానీ.. ఎక్కువగా పెంచి చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. అది నిజమో కాదో తెలియక పోయినా.. కొందరు ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో ఇంకొందరు కల్కి 2898 ఏడీ మూవీ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అప్పుడు ఆ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసిన విషయం తెలిసిందే.

అ సమయంలో సమోసా క్రిటిక్స్ అని బాలీవుడ్ వాళ్లు ఎద్దేవా చేసే కొందరు.. కల్కి కలెక్షన్లు ఫేక్ అంటూ వరుసగా పోస్టులు పెట్టారు. వసూళ్ల ఫిగర్ మీద అనేక సెటైర్లు వేశారు. దీంతో నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ వారి మీద రూ.25 కోట్ల పరువు నష్టం దావా వేసింది. తగిన గుణపాఠం చెప్పాలని డిసైడ్ అయ్యి అలా చేసినట్లు ఉంది.

అయితే ఇప్పుడు ఓ నెటిజన్.. ఆ సమోసా క్రిటిక్స్ ను ట్యాగ్ చేస్తూ క్వశ్చన్ చేశారు. అప్పుడు కల్కి విషయంలో తెగ పోస్టులు పెట్టారు కదా.. మరి ఇప్పుడు పుష్ప-2 విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారని క్వశ్చన్ చేశారు. దీంతో ఆ పోస్ట్ వైరల్ గా మారగా.. కల్కి మేకర్స్ ఇచ్చిన ఝలక్ కు సైలెంట్ గా ఉన్నారేమోనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి దత్ ఫ్యామిలీ ఇచ్చిన ఝలక్ ఎఫెక్ట్ బాగానే పడినట్లుంది!

Tags:    

Similar News