ట్రోలింగ్ పై ఆ బ్యూటీ ఏమందంటే?
`మీర్జాపూర్` వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఓ బ్రాండ్ గా స్ట్రీమింగ్ అయింది.
`మీర్జాపూర్` వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఓ బ్రాండ్ గా స్ట్రీమింగ్ అయింది. రెండు సీజన్లు భారీ విజయం సాధించాయి. అడల్ట్, క్రైమ్ కంటెంట్ కి ప్రేక్షకులు నిజంగా బ్రహ్మరధమే పట్టారు. దీంతో భారీ అంచనాల మధ్యనే సీజన్ -3 కూడా ఇటీవలే రిలీజ్ అయింది. అయితే ఇది మిగతా రెండు సీజన్లతో పొలిస్తే అంతగా బాగాలేదనే టాక్ వచ్చింది. అడల్ట్ కంటెంట్ కూడా తక్కువగా ఉందని మెజార్టీ వర్గం అభిప్రాయపడింది.
ప్రేక్షకుల అంచనాలను సీజన్ 3 అందులేదంటూ ఓపెన్ గానే చాలా మంది సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. అయితే ఇందులో గజ్‌గామిని గుప్తా (గోలు) పాత్రను శ్వేతా త్రిపాఠి పోషించింది. అయితే ప్రీమియర్ అనంతరం శ్వేతా త్రిపాఠి నెట్టింట ట్రోలింగ్ కి గురైంది. అమ్మడిని ఏమాత్రం కనికరం లేకుండా ట్రోల్ చేసారు. సీరిస్ లో ఆమె నటన చెత్త అంటూ ట్యాగ్ చేసి ట్రోల్ చేసారు. గోలు పాత్రను డిజైన్ చేసిన విధానం ఏమాత్రం బాగోలేదంటూ మండిపడ్డారు.
తాజాగా ఈ ట్రోలింగ్ పై శ్వేతా త్రిపాఠి అసహనాన్ని వ్యక్తం చేసింది. `ప్రజలు చాలా త్వరగా ద్వేషిస్తారని నేను భావిస్తున్నాను. అయితే నా చుట్టూ ఉన్నవారు మీర్జాపూర్‌ని డెప్త్ ని అర్దం చేసుకుంటున్నారు. క్లిష్టమైన కథనాన్ని ఆస్వాదిస్తున్నారు. పాత్రధారులుగా మేము..సృష్టి కర్తలుగా మేకర్స్ తమ వంతు కషి చేసారు. సక్సెస్ అనేది కేవలం ప్రేక్షకుపైనే అధారపడి ఉంది. ఇందులో ఎమోషన్ లో చాలా డెప్త్ ఉంది. దాన్ని సరిగ్గా అర్దం చేసుకోగలగాలి. అది పూర్తిగా మనం చూసే దృష్టి కోణంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.
ఈ సీజన్ ని ఎంతో అర్దం చేసుకుంటూ చూడాలి. చర్య, హింసకు సంబంధించింది కాదు. సంబంధాలు, మానసిక ఆరోగ్యాన్ని కూడా అన్వేషించే సీజన్ ఇది. వీక్షకులు కాలక్రమేణా ఈ అంశాలను అభినంది స్తారని మేము ఆశిస్తున్నాము. సీజన్ 4 గురించి ఇప్పటికే చర్చలు కూడా మొదలయ్యాయి` అని తెలిపింది.