'వీరమల్లు' కాంట్రాక్ట్ కారణంగానే వేరే సినిమాలు చెయ్యలేదు: నిధి అగర్వాల్
పవన్ కల్యాణ్, ప్రభాస్ వంటి ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన 'హరి హర వీరమల్లు', 'ది రాజాసాబ్' వంటి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది.
అందాల భామ నిధి అగర్వాల్ బిగ్ స్క్రీన్ మీద కనిపించి చాలా కాలమైంది. తెలుగులో సినిమా చేసి దాదాపు మూడేళ్లు గడిచిపోయింది. పవన్ కల్యాణ్, ప్రభాస్ వంటి ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన 'హరి హర వీరమల్లు', 'ది రాజాసాబ్' వంటి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. కానీ అవి రెండూ ఇంకా సెట్స్ మీదనే ఉన్నాయి. ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది క్లారిటీ రావడం లేదు. ఇవి కాకుండా నిధి మరే ఇతర ప్రాజెక్ట్స్ కు సైన్ చేసినట్లు లేదు. కెరీర్ లో ఇంత గ్యాప్ రావడంపై అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.
నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. "నేను గ్యాప్ ఇవ్వలేదు. గ్యాప్ వచ్చింది. ఫస్ట్ లాక్ డౌన్ కు ముందే 'హరిహర వీరమల్లు' సినిమాకు సైన్ చేశాను. ఆ టైమ్ కి గ్యాప్ లేదు. కానీ ఈ సినిమా ప్రాసెస్ జరగడానికి ఆల్మోస్ట్ మూడున్నర నుంచి నాలుగేళ్లు పట్టింది. ఈ సినిమా కంప్లీట్ వరకు వేరే ప్రాజెక్ట్ ఒప్పుకోకూడదని నేను కాంట్రాక్ట్ మీద సైన్ చేశాను. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన షూటింగ్ కి డేట్స్ ఇచ్చినప్పుడు నేను కూడా అందుబాటులో ఉండాలని ప్రొడక్షన్ టీమ్ కోరింది. అందుకే ఆఫర్స్ వచ్చినా నేను వేరే సినిమా ఏదీ చేయలేదు. షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మరో లాక్ డౌన్ వచ్చింది. చాలా టైమ్ పట్టింది. ఇక్కడ ఎవరి తప్పూ లేదు" అని తెలిపింది.
"రాజాసాబ్ లో నటించే అవకాశం వచ్చినప్పుడు, ఇలాంటి బిగ్ ఫిల్మ్ లో భాగం కావాలని, ఈ సినిమా వదులుకోకూడదు అని నిర్ణయించుకున్నాను. 'హరి హర వీరమల్లు' మూవీ టీమ్ తో మాట్లాడితో, 'ఓకే సినిమా చేసుకోండి, ఏం చేద్దామనేది తర్వాత ఆలోచిద్దాం' అని చెప్పారు. కానీ ఇప్పుడేమో అనుకోకుండా డేట్స్ అన్నీ క్లాష్ అయ్యాయి. సో నేను వేరే ప్రాజెక్ట్ చేయకూడదని సైన్ చేశాను కాబట్టే సినిమాలు చేయలేదు. మొదటి రోజు నుంచే వీరమల్లు చిత్రం మీద నాకు చాలా నమ్మకం వుంది. రాజాసాబ్, వీరమల్లు రెండూ వేటికవే భిన్నమైన సినిమాలు" అని నిధి చెప్పింది. 2025 తనకు బాగా కలిసొస్తుందని ఆశిస్తున్నానని తెలిపింది.
తనతో పాటు వచ్చిన హీరోయిన్లు చాలా సినిమాలు చేస్తుంటే, తాను మాత్రం ఇలా స్టక్ అయిపోయినందుకు చాలాసార్లు బాధ పడ్డానని నిధి అగర్వాల్ చెప్పింది. "ఆ అమ్మాయి నీ ప్లేస్ కొట్టేసింది.. ఈ అమ్మాయి చాలా సినిమాలు చేస్తోంది అంటూ నా చుట్టూ ఉన్నవారు చెప్పేవారు. నాకు మామూలుగా ఇలాంటి థాట్స్ రావు. కానీ ఎప్పుడైతే అందరూ నాతో చెప్పడం వల్ల నిజమే కావచ్చు కదా అనే ఆలోచన వచ్చేది. ఎవరైనా నా ప్లేస్ తీసుకున్నారంటే, అది నా ప్లేస్ కాదని అర్థం. అది వాళ్ళకి రాసిపెట్టి ఉందని అనుకోవాలి అంతే. నిజాయితీగా చెప్పాలంటే చాలాసార్లు నాకు బాధగా అనిపించింది. నాతో సహా ఇక్కడ ఎవరి తప్పూ లేదు. టైమ్ అంతే. టైమ్ వస్తే నువ్వు ఏమి చేసినా వర్క్ అవుతుంది. నీ టైమ్ కానప్పుడు ఏది చేసినా వర్కవుట్ అవ్వదు. నేను డెస్టినీ, దేవుడు, టైమ్, మ్యాజిక్.. అన్నీ నమ్ముతాను" అని పేర్కొంది.
"లాక్ డౌన్ తర్వాత పవన్ కల్యాణ్ పొలిటికల్ క్యాంపెయిన్ కి వెళ్ళడం వల్ల షూటింగు చేయడం కుదరలేదు. ఆ గ్యాప్ లో నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. వాటిల్లో కొన్ని నేను చేసేవి ఉన్నాయి.. చేయకూడనివి ఇంకొన్ని ఉన్నాయి. కానీ నాకు ఆ ఒక్క ప్రాజెక్ట్ మీద విశ్వాసం, నమ్మకం ఉన్నాయి. ఆ సినిమా వచ్చినప్పుడు వేస్ట్ అయిన టైం, నేను కోల్పోయిన సంవత్సరాలు, వదులుకున్న ఈవెంట్స్, కార్చిన కన్నీళ్ళు.. అన్నిటినీ మర్చిపోయేలా చేస్తుందని భావిస్తున్నాను" అని ఇస్మార్ట్ బ్యూటీ చెప్పింది. ఈ గ్యాప్ లో చాలాసార్లు ఏడ్చానని తెలిపింది. నిస్సహాయరాలిగా ఉన్నానని అనుకున్నప్పుడు ఏడ్చాను. పరిస్థితులను మార్చచడానికి నా చేతిలో ఏమీ లేదు. నేనే కాదు, ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి అదని పేర్కొంది. ఆ సమయంలో మనీ ప్రాబ్లమ్ రాలేదని.. బ్రాండ్ ప్రమోషన్స్, ఇన్స్టాగ్రామ్ పోస్టులు, యాడ్స్ , ఈవెంట్స్ ద్వారా డబ్బు సంపాదించానని చెప్పుకొచ్చింది