వీరమల్లు బ్యూటీ కూడా కత్తి దూస్తుందా?
పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ హీరో అయితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. వార్ వన్ సైడ్. ఇక హీరోయిన్ పాత్ర అంటే? ఇలా కనిపించి అలా వెళ్లిపోయేదిగానే ఉంటుంది.;
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తోన్న 'హరి హరహర వీరమల్లు'లో నిధి అగర్వాల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈమెతో పాటు నర్గీస్ ఫక్రీ, నోరా ఫటేహీ కూడా నటిస్తోంది. మరి వీళ్లలో హీరోయిన్ ఎవరు? అంటే నిధి అగర్వాల్ అనే తెలుస్తోంది. అయితే ఇది ఔరంగజేబుపై వీరమల్లు పోరాటమని ఇప్పటికే తేలిపోయింది. ఇప్పటి వరకూ కథపై క్లారిటీ లోపించినా `ఛావా` రిలీజ్ తర్వాత వీరమల్లు కత్తి దూసేది ఔరంగజేబు పైనని అర్దమైంది.
పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ హీరో అయితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. వార్ వన్ సైడ్. ఇక హీరోయిన్ పాత్ర అంటే? ఇలా కనిపించి అలా వెళ్లిపోయేదిగానే ఉంటుంది. హీరో సరసన డాన్సులకు, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలకే పరిమితం అనే అంతా నమ్ముతారు. అయితే నిధి అగర్వాల్ మాత్రం తన పాత్ర అలా ఉండదని ధీమా వ్యక్తం చేసింది. ఇందులో నిధి అగర్వాల్ పంచమి అనే పాత్ర పోషిస్తుంది.
ఈ పాత్రకు సినిమాలో ఓ బలమైన స్టోరి ఉందంటోంది. ఆ పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందంది. పంచమి పాత్ర ఓ లక్ష్యం కోసం పనిచేస్తుందిట. అందరూ అందంగా కనిపించే నిధిని మాత్రమే చూస్తారనుకుంటే అది అపోహ మాత్రమేనని అమ్మడు చెబుతుంది. ఇప్పటికే నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. అందులో ఎంతో అందంగా కనిపిస్తుంది. అచ్చం యువరాణినే తలపిస్తుంది.
అయితే నిధి అగర్వాల్ తాజా వ్యాఖ్యల్ని బట్టి ఈ అమ్మడు కూడా సినిమాలో పవన్ కళ్యాణ్ లాగే కత్తి కూడా దూస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నిధి అగర్వాల్ చేతిలో ఉన్నది కూడా ఈ ఒక్క సినిమానే. దీనిపై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితేనే మరో సినిమాలో ఛాన్స్. లేదంటే కెరీర్ కష్టమే అన్న ప్రచారం ఇప్పటికై మొదలైపోయింది.