పిక్ టాక్‌ : నిధి రాజాసాబ్‌ లీక్డ్‌ ఫోటో కాదు

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.

Update: 2024-12-19 08:27 GMT

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. అయితే వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ఎక్కువగా ఉన్న కారణంగా సినిమాను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త విడుదల తేదీ విషయమై చర్చ జరుగుతోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో రాజాసాబ్‌ నుంచి లీక్డ్‌ ఫోటో అంటూ నిధి అగర్వాల్‌ ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ విషయం పై నిధి అగర్వాల్‌ స్వయంగా క్లారిటీ ఇస్తూ అది లీక్‌ ఫోటో కాదని చెప్పుకొచ్చింది.

సోషల్‌ మీడియా ద్వారా నిధి అగర్వాల్‌ స్పందిస్తూ... రాజా సాబ్‌ సినిమాలోని తన ఫోటో అంటూ ఏదైతే పిక్‌ వైరల్‌ అవుతోందో అది ఆ సినిమాలోనిది కాదు, అది ఒక యాడ్‌ షూట్‌ సందర్భంగా తీసిన ఫోటో, దాన్ని కొందరు కావాలి అని రాజాసాబ్‌ సినిమా లీక్డ్‌ ఫోటో అంటూ ప్రచారం చేస్తున్నారు. రాజాసాబ్‌ కి సంబంధించిన ఫోటోలను త్వరలో మీ ముందుకు తీసుకు వస్తాం. తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా రాజాసాబ్‌ ఉంటుంది, అప్పటి వరకు లీక్‌ లను, పుకార్లను నమ్మవద్దు అంటూ ఆమె విజ్ఞప్తి చేస్తూ పోస్ట్‌ చేసింది.

రాజాసాబ్‌లో నిధి అగర్వాల్‌ లుక్‌ ఇలా ఉంటుంది అంటూ ప్రచారం చేసిన వారు సైలెంట్‌ అయ్యారు. రాజాసాబ్ నుంచి త్వరలోనే నిధి అగర్వాల్‌ పోస్టర్‌ను మారుతి విడుదల చేస్తాడేమో చూడాలి. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌తో పాటు ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌, రిద్ది కుమార్‌లు నటిస్తున్నారు. ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ చేయబోతున్న రొమాన్స్ ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఈ హర్రర్‌ కామెడీ సినిమా ఓ రేంజ్‌లో వినోదాన్ని పంచడంతో పాటు రికార్డ్‌ స్థాయి వసూళ్లు సొంతం చేసుకుంటుంది అంటూ మేకర్స్‌ అంటున్నారు.

సలార్‌, కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో సక్సెస్ దక్కించుకున్న ప్రభాస్‌ ఈ సినిమాతో రాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటి వరకు చిన్న సినిమాలను రూపొందించిన దర్శకుడు మారుతి మొదటి సారి పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. వందల కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్‌ రేంజ్‌ హర్రర్‌ సీన్స్‌తో ఈ సినిమా ఉంటుంది అంటున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌ చివర్లో లేదా దసరా వరకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News