నిహారిక ఫస్ట్ మూవీ.. అలా మొదలైంది
మెగా డాటర్ నిహారిక కొనెదల నిర్మాతగా తన ప్రొడక్షన్ నుంచి మొదటి సినిమాని సెట్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మెగా డాటర్ నిహారిక కొనెదల నిర్మాతగా తన ప్రొడక్షన్ నుంచి మొదటి సినిమాని సెట్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వెబ్ సిరీస్ లు చేసిన నిహారిక ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై ప్రొడ్యూసర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది. తాజాగా శుక్రవారం పూజా కార్యక్రమాలతో కొత్త చిత్రాన్ని ప్రారంభించింది. అల్లు అరవింద్, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, నాగబాబు దంపతులు ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అందరూ కొత్తవాళ్లతో నిహారిక చేస్తోన్న ఈ ప్రయోగానికి మెగా ఫ్యామిలీ నుంచి సపూర్ణ మద్దతు ఉంది. హీరోయిన్ గా బిగ్ స్క్రీన్ పై సక్సెస్ కొట్టలేకపోయిన నిర్మాతగా ఆమె చేస్తోన్న ప్రయత్నానికి, ప్రయాణానికి సహకారం అందిస్తున్నారు. చెల్లెలు నిహారిక చేసే ప్రతి పనికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సపోర్ట్ కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నిర్మాతగా నిహారిక ఫస్ట్ సినిమాని వరుణ్ తేజ్ క్లాప్ కొట్టి ప్రారంభించాడు.
నాగబాబు కెమెరా ఆన్ చేశారు. అల్లు అరవింద్ యాక్షన్ చెప్పారు. ఇక ఈ మూవీతో యాదు వంశీ అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కంప్లీట్ గా న్యూ క్యాస్టింగ్ తోనే ఈ మూవీని నిహారిక తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. రాజశేఖర్ కూతుళ్ళు శివాని, శివాత్మిక కూడా ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి రావడం విశేషం. దీనిని బట్టి సినిమాలో వారు ఏమైనా నటిస్తున్నారా అనే క్వశ్చన్ కూడా వినిపిస్తోంది.
ఇప్పటి వరకు వరుసగా మూడు వెబ్ సిరీస్ లు ఓటీటీలో నిహారిక నిర్మాతగా చేసింది. డెడ్ ఫిక్సల్స్ వెబ్ సిరీస్ లో ఆమె లీడ్ రోల్ లో నటించి నిర్మించింది. ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ వన్ మూవీని స్టార్ట్ చేసింది. లో బడ్జెట్ తోనే ఈ చిత్రాన్ని ఆమె నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది.
మరి నిర్మాతగా నిహారికకి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మూవీ లాంచింగ్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిహారిక ఈ సినిమాలో నటించే అవకాశాలు లేవని తెలుస్తోంది.