పవన్ బాబాయ్ పేరు KKK.. అకీరా గిఫ్ట్ ఒక మొక్క: నిహారిక
ఇదే సమయంలో మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల రాఖీ పండుగ గురించి ప్రస్థావిస్తూ త్రోబ్యాక్ విషయాన్ని గుర్తు చేసుకున్నారు
ప్రతిసారీ రాఖీ పండగ విశిష్ఠతను మెగా కుటుంబం గుర్తు చేస్తూనే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవికి రాఖీ కట్టి సోదరీమణులు అన్నయ్య ఆశీర్వాదం అందుకుంటారు. అదే ఆచారాన్ని కుటుంబ వారసత్వం కూడా పాటిస్తుంది.
ఈ ఏడాది ఆగస్టు 19న రాఖీ పండగకు సమయం దగ్గరపడుతోంది.
ఇదే సమయంలో మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల రాఖీ పండుగ గురించి ప్రస్థావిస్తూ త్రోబ్యాక్ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ కుమారుడు, తన సోదరుడు అయిన అకీరా నందన్ నుండి అందుకున్న ప్రత్యేక రాఖీ బహుమతి గురించి నిహారిక వివరాలను షేర్ చేసారు. రక్షా బంధన్ సందర్భంగా తనకు లభించిన బహుమతులలో అకీరా నందన్ ఇచ్చిన బహుమతి చాలా ప్రత్యేకమైనది అని తెలిపింది. అకీరాకు స్వయంగా చేతితో తయారు చేసిన రాఖీని ప్రేమగా కట్టిన నిహారికకు ఒక అందమైన మొక్క కానుకగా లభించింది. ఆ మొక్క పవన్ పంపినది.
ఇది చాలా గర్వించదగినది. ఆ మొక్క ఇప్పటికీ పెరిగి పెద్దదవుతోందని నిహారిక తెలిపింది. ఇది తన సోదరుడు బాబాయ్ ల ఆలోచనా విధానాన్ని నిరంతరం గుర్తు చేస్తుందని తెలిపింది. పవన్ కల్యాణ్ పేరును తన ఫోన్ లో కేకేకే అని సేవ్ చేసుకున్నట్టు నిహారిక వెల్లడించింది. కొణిదెల కళ్యాణ్ కుమార్ పూర్తి పేరు అని తెలుసుకున్న తర్వాత అలా సేవ్ చేసుకున్నానని నిహారిక తెలిపారు.
తన తదుపరి ప్రాజెక్టుల గురించి ప్రచారం చేస్తూనే ఇలాంటి వ్యక్తిగత విషయాలను నిహారిక షేర్ చేసారు. టాలీవుడ్ కోలీవుడ్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లతో కెరీర్ ని బ్యాలెన్స్ చేసేందుకు నిహారికకు మంచి ప్రణాళికలు ఉన్నాయి. కొన్నిటిలో నటిస్తోంది. మరికొన్నిటిని నిర్మిస్తోంది. నటిగా, నిర్మాతగా మంచి కథల్ని ఎంపిక చేయాలనేది తన ఆలోచన. కుటుంబంతో తన అనుబంధం, వృత్తిగతమైన ఆకాంక్షలు అందరినీ ఆకర్షించేవే. నిహారిక ఎంచుకున్న రంగంలో పెద్ద స్థాయికి ఎదగాలని ఆకాంక్షిద్దాం.