అఖిల్ సరసన మెగా ప్రిన్సెస్.. రాజమౌళి వద్దన్నారు!
బుల్లితెర, వెండితెర రెండు చోట్లా సుపరిచితురాలైన నటి నిహారిక కొణిదెల.
బుల్లితెర, వెండితెర రెండు చోట్లా సుపరిచితురాలైన నటి నిహారిక కొణిదెల. ఇటీవల నిర్మాతగా, నటిగా రెండు పడవల ప్రయాణం సాగిస్తోంది. గత కొంతకాలంగా తమిళ చిత్రాలతో బిజీ అయిన నిహారిక కొణిదెల తదుపరి తెలుగులోను నటిగా బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అదే క్రమంలో తనను తెలుగు దర్శకులు కూడా పరిగణించాలని, తన వెనక ఉన్న సూపర్ పవర్స్ ని చూసి బెదిరిపోవద్దని కూడా సరదాగా వ్యాఖ్యానించింది. కథ విని ఫైనల్ చేసేది తాను మాత్రమేనని ఇతరుల జోక్యం ఉండదని కూడా స్పష్ఠం చేసింది.
అదంతా అటుంచితే ఇప్పుడు తన తదుపరి చిత్రం కమిటీ కుర్రాళ్లు ప్రచార కర్యక్రమాల్లో నిహారిక త్రోబ్యాక్ విషయాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. తాను మెగా కుటుంబం నుంచి వచ్చినందున తనపై గ్లామర్ రంగం ప్రభావం చాలా ఎక్కువగా ఉందని, తనకు నటన అంటే చాలా ఇష్టమని నిహారిక తెలిపారు. నటిస్తానని తొలిగా పెదనాన్న చిరంజీవికి చెప్పానని అయితే ఈ రంగంలో పాజిటివిటీతో పాటు నెగెటివిటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని తనతో చెప్పినప్పుడు తొలిగా భయపడ్డానని కానీ చివరికి నటి అయ్యానని తెలిపారు.
ఆరంభం విశ్వక్ సేన్ తో కలిసి ఓ లఘు చిత్రంలో నటించే అవకాశం వచ్చినా చేయలేదు. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో ఓ లఘు చిత్రంలో నటించాను. రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ దీనిని రూపొందించారు. కానీ రాజమౌళి ఇది చూసి రిలీజ్ చేయకపోవడమే ఉత్తమమని అన్నారని నిహారిక తెలిపారు. అటుపై ముద్దపప్పు ఆవకాయ్ సహా పలు వెబ్ సిరీస్ లను నిహానిక నిర్మించిన సంగతి తెలిసిందే. సినీనటిగా, వెబ్ సిరీస్ నటిగాను రాణించింది. తనకు ఒక మనసు కథ నచ్చిన తర్వాత సినీఎంట్రీ ఇచ్చానని నిహారిక వెల్లడించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళంలోను నటిస్తోంది. ఇక నిర్మాతగా సొంత బ్యానర్ లో సినిమాలు చేసేందుకు నిహారిక ప్రయత్నిస్తోంది.