నిహారిక.. పసిడి వర్ణంతో మెరిసిపోతూ

వివరాళ్లోకి వెళితే.. నిహారిక.. ట్రెడిషనల్​గా ఆరెంజ్ కలర్ సిల్క్​ చీరలో జాకెట్ లేకుండా.. శైలపుత్రి సంప్రదాయంలో కనిపించి ఆకట్టుకుంది.

Update: 2023-10-16 08:32 GMT

మెగా డాటర్ నిహారిక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్​గా కనిపిస్తోంది. నటిగా ఎదిగే ప్రయత్నాల్లో.. నిహారిక చేస్తున్న బోల్డ్ ఫోటో షూట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వెబ్ సిరీస్​లు చేస్తూ, ఫారెన్ ట్రిప్స్​కు వెళ్తూ..లైఫ్​ను ఫుల్​ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కళ్లు చెదిరే రేంజ్​లో రెట్రో ఫొటోషూట్​ చేయగా అది ఫుల్ వైరల్​గా మారింది.


వివరాళ్లోకి వెళితే.. నిహారిక.. ట్రెడిషనల్​గా ఆరెంజ్ కలర్ సిల్క్​ చీరలో జాకెట్ లేకుండా.. శైలపుత్రి సంప్రదాయంలో కనిపించి ఆకట్టుకుంది. "శైలపుత్రి, పర్వతాల కూతురు. ఆరెంజ్ కలర్​ ప్రకాశాన్ని, బలాన్ని, దయను రిప్రజెంట్​ చేస్తుంది" అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.

ప్రాచీన కాలం నాటి కట్టడాలపై సూర్యుని కిరణాలు పడి.. వాటి నీడలు మధ్య నిహారిక కూర్చొని ఉండటం, అవే కిరణాలు ఆమె నారింజ రంగు చీరపై కూడా పడటం, ఆ వెలుగులో నిహారిక ముఖం మిలమిల మెరవడం.. అంతా చాలా బాగా కనిపించాయి. నిహారికకు మరింత అందాన్ని తెచ్చాయి.

నిహారిక బ్లౌజ్​ లెస్​ చీర డిజైన్​ ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసింది. ఆమె ధరించిన జ్యూవెలరీ, హెయిర్​ను లూస్​గా వదిలేయడంతో తన ఫేస్​ ఎంతో ఛార్మింగ్​గా కనిపించింది. మొత్తంగా ఆమె రెట్రో లుక్​ మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. కాగా, అంతకుముందు డార్క్ థీమ్​తో కూడా కొన్ని అదిరే పోజుల్లో కాకరేపింది నిహారిక. ఈ ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక... ఒక మనసు చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సహా పలు చిత్రాల్లో నటించింది. అవి వర్కౌట్ కాలేదు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుంది. నిర్మాణ సంస్థ స్థాపించి భర్తతో కలిసి సినిమాలను నిర్మించింది. కానీ ఆ తర్వాత ఆమె వివాహ జీవితం సాఫీగా సాగలేదేమో విడాకులు కూడా తీసుకుని మళ్లీ కెరీర్​పై ఫోకస్ పెట్టింది.

Tags:    

Similar News