వరుణ్ సందేశ్ 'నింద' ట్రైలర్.. ఎలా ఉందంటే?
యదార్థ సంఘటనల ఆధారంగా రాజేష్ జగన్నాథం.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు.
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్.. సూపర్ హిట్ హ్యాపీడేస్ మూవీతో ఎలాంటి ఫేమ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. వరుస విజయాలు సాధించడంతో యూత్ ఫేవరెట్ గా మారిపోయారు. కానీ ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. కాస్త బ్రేక్ తీసుకుని మళ్లీ చిత్రాలతో ఇప్పుడు బిజీగా మారిన వరుణ్.. గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ప్రస్తుతం క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ నింద సినిమాలో యాక్ట్ చేస్తున్నారు.
యదార్థ సంఘటనల ఆధారంగా రాజేష్ జగన్నాథం.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఆడియన్స్ లో సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. టీజర్ లో జీవితంలో కొన్ని సార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు అనే డైలాగ్ మూవీపై ఆసక్తి పెంచుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. మంచి వాడి కోపం ఒక వినాశనానికి ఆరంభం! అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మంచోడికి న్యాయం జరుగుతుందని నమ్మకం పోయిన రోజే సమాజం చనిపోయినట్లు అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత ముగ్గురిని కిడ్నాప్ చేసినట్లు చూపించారు మేకర్స్. అదే ఫ్రేమ్ లో వరుణ్ ఫైల్ చూస్తూ ఎంట్రీ ఇచ్చారు.
అనంతరం సినిమాలోని పాత్రలు, లవ్ స్టోరీని పరిచయం చేశారు మేకర్స్. వరుణ్ సందేశ్ తన పాత్రలో ఒదిగిపోయారు. విజువల్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. డైలాగ్స్ అన్నీ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మొత్తంగా ట్రైలర్ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఓ మర్డర్ కేసులో చేయని తప్పుకు నింద భరిస్తున్న వ్యక్తి కథే సినిమా అని తెలుస్తోంది. చివరకు ఏం జరిగిందనేది మిగతా మూవీగా అర్ధమవుతోంది.
ఈ సినిమాలో ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, ఛత్రపతి శేఖర్, మైమ్ మధు, శ్రేయా రాణి రెడ్డి, సిద్ధార్థ్ గొల్లపూడి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంతూ ఓంకార్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా రమీజ్ నీవత్.. ఎడిటర్ గా అనిల్ కుమార్ వ్యవహరిస్తున్నారు. జూన్ 21వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి ఈ మూవీతో వరుణ్ సందేశ్ ఎలాంటి హిట్ కొడతారో వేచి చూడాలి.