శుభ‌వార్త‌: జూనియ‌ర్ నితిన్ ఆగ‌మ‌నం

యూత్ స్టార్ నితిన్ భార్య షాలిని ఈరోజు మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి , కొడుకులు బాగానే ఉన్నారు.

Update: 2024-09-06 16:01 GMT

యూత్ స్టార్ నితిన్ భార్య షాలిని ఈరోజు మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి , కొడుకులు బాగానే ఉన్నారు. నితిన్ ఈ శుభవార్తను ఆనందంగా ప్రకటించారు. మా కుటుంబంలోని సరికొత్త స్టార్‌కి స్వాగతం! అని నితిన్ సోష‌ల్ మీడియాలో రాసాడు. దీంతో పాటు ఒక అందమైన ఫోటోను షేర్ చేసాడు. దీనిలో ఈ జంట చిన్న పిల్లవాడిని పట్టుకున్నట్లు కనిపిస్తుంది.

ఈ ప్రత్యేక సందర్భంగా పరిశ్రమ నలుమూలల నుంచి హృదయపూర్వక అభినందన సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు సోష‌ల్ మీడియాల్లో శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. నితిన్- షాలిని 2020లో పెళ్లి చేసుకున్నారు. వారి వివాహం బంధుమిత్రుల‌ సమక్షంలో సన్నిహిత వేడుకగా జరిగింది.

ఎట్ట‌కేల‌కు నితిన్ తన వార‌సుడిని ప‌రిచ‌యం చేసాడు. జూనియ‌ర్ నితిన్ జ‌న్మించాడు! అంటూ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్‌హుడ్‌లో నటిస్తున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల గ‌తంలో నితిన్‌కి భీష్మ రూపంలో భారీ హిట్ అందించాడు. ఈ కాంబినేష‌న్ పై భారీ అంచ‌నాలున్నాయి. రాబిన్‌హుడ్‌తో మరో బ్లాక్‌బస్టర్ అందిస్తార‌ని అభిమానులు ఆశిస్తున్నారు.

Tags:    

Similar News