రాబిన్ హుడ్.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు
ఈ చిత్రంలో నితిన్ కి జోడీగా క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
నితిన్ హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాబిన్ హుడ్’. ‘భీష్మ’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా కావడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ చిత్రంలో నితిన్ కి జోడీగా క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
నిజానికి 2024 డిసెంబర్ 21న ఈ సినిమాని రిలీజ్ చేస్తామని మేకర్స్ ముందుగా ప్రకటించారు. తరువాత ఆ డేట్ వాయిదా పడింది. మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని వెంకి కుడుముల తెరకెక్కించారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ టీజర్ కి మంచి స్పందన వచ్చింది.
‘భీష్మ’ తరహాలోనే ఫుల్ ఫన్ రైడ్ గా ఈ చిత్రం కూడా ఉండబోతోందని టీజర్ బట్టి తెలుస్తోంది. ఇదిలా ఉంటే రిపబ్లిక్ డే సందర్భంగా మేకర్స్ రాబిన్ హుడ్ మేకింగ్ వీడియో ని రిలీజ్ చేశారు. అయినవాళ్ల దగ్గర తీసుకోవడం నా హక్కు… మై బేసిక్ రైట్.. బికాజ్ ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని నితిన్ చెప్పే డైలాగ్ ని హైలైట్ చేశారు. ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే డైలాగ్ ని హైలైట్ చేశారు. అలాగే షూటింగ్ కి సంబంధించిన విజువల్స్ ఈ మేకింగ్ వీడియోలో పంచుకున్నారు.
రిపబ్లిక్ డే సందర్భంగా నితిన్ ఫ్యాన్స్ తో పాటు ఆల్ ఇండియన్స్ కి విషెస్ చెబుతూ ఈ మేకింగ్ వీడియోని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నితిన్ ఒక దొంగగా కనిపించబోతున్నాడు. అతని క్యారెక్టరైజేషన్ ఫుల్ ఫన్ జెనరేట్ చేసే విధంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాని నితిన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. చేస్తోంటే ‘రాబిన్ హుడ్’ తో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అని అనిపిస్తుంది.
శ్రీలీలకి కూడా హీరోయిన్ గా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం అని చెప్పాలి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇప్పటికే సినిమా నుంచి ఒక సాంగ్ కూడా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. నితిన్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. దీంతో పాటు నితిన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘తమ్ముడు’ మూవీ కూడా చేస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.