నితిన్ 'రాబిన్ హుడ్'.. కొత్త మ్యాటర్ ఏంటంటే?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్.. సరైన హిట్ కోసం కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-09-22 12:37 GMT

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్.. సరైన హిట్ కోసం కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. వరుసగా సినిమాలు చేస్తున్నా.. అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోతున్నారు. రీసెంట్ గా ఎక్స్ ట్రా ఆర్డినరీ మూవీతో వచ్చిన నితిన్.. ఊహించని డిజాస్టర్ అందుకున్నారు. దీంతో తన అప్ కమింగ్ మూవీలపైనే నమ్మకం పెట్టుకున్నారు. ప్రస్తుతం రెండు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్టుల షూటింగ్స్ లో కంటిన్యూగా పాల్గొంటున్నారు.

అందులో ఒకటి తమ్ముడు మూవీ కాగా.. మరొకటి రాబిన్ హుడ్. గతంలో నితిన్ కు భీష్మతో మంచి హిట్ అందించిన డైరెక్టర్ వెంకీ కుడుములనే రాబిన్ హుడ్ మూవీని తెరకెక్కిస్తున్నారు. దీంతో మరోసారి మ్యాజిక్ రిపీట్ అవుతుందని సినీ ప్రియులతో పాటు నితిన్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆ మూవీ 2024లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 20న విడుదల అవ్వనుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న రాబిన్ హుడ్ మూవీలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అయితే యాక్షన్ అండ్ హీస్ట్ కామెడీ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమా నుంచి ఆదివారం మేకర్స్ కొత్త అప్డేట్ ఇచ్చారు. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ప్రస్తుతం మూవీ షూటింగ్ జరుగుతున్నట్లు వెల్లడించారు. హీరోహీరోయిన్ల పై పెర్ఫెక్ట్ డ్యూయెట్ సాంగ్ షూట్ చేస్తున్నట్లు తెలిపారు.

జీవీ ప్రకాష్ కుమార్ బాణీలు కట్టిన డ్యూయెట్ సాంగ్ కు కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మెల్ బోర్న్ చుట్టూ ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్స్ లో చిత్రీకరిస్తున్నారు. నితిన్, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ సాంగ్ కు హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. అయితే డ్యూయెట్ సాంగ్ తో పాటు బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ సహా ప్రధాన తారగణంతో కూడిన కీలక సన్నివేశాలు కూడా మేకర్స్ ఆస్ట్రేలియాలో షూట్ చేయనున్నారు.

ఇక మిగతా వివరాలకు వస్తే.. రాబిన్ హుడ్ మూవీలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్ర పోషిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సాయి శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు. ఎడిటర్ గా కోటి, ఆర్ట్ డైరెక్టర్ గా రామ్ కుమార్ బాధ్యతలు వహిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా మేకర్స్ సినిమాను విడుదల చేయనున్నారు. మరి ఈ మూవీతో నితిన్ ఎలాంటి విజయం అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News