బామ్మర్దికి వెనుక బావ..సహకారం మరువలేనిది!
తాజాగా ఇదే విషయాన్ని నితిన్ నిన్నటి రోజున చెప్పే ప్రయత్నం చేసాడు. మా బావ లేకపోతే సినిమాల్లో నేను కష్టం అన్నట్లుగానే ఆయన వ్యాఖ్యానించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతి సోదరుడు నార్నె నితిన్ 'మ్యాడ్' అనే చిత్రంతో హీరోగా పరిచయ మవుతోన్న సంగతి తెలిసిందే. ఇదొక యూత్ పుల్ ఎంటర్ టైనర్. కళ్యాణ్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కి స్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించడం విశేషం. నితిన్ తొలి సినిమానే అగ్ర బ్యానర్ లో నిర్మాణం జరుగుతుంది. అయితే దీని వెనుక కర్త...కర్మ..క్రియ అన్ని ఎన్టీఆర్ అనే తెలుస్తోంది.
నార్నె కుటుంబానికి సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. కేవలం రాజకీయంగా ఆ కుటుంబ సభ్యులున్నారు తప్ప! సినిమాల్లో ఎవరూ లేరు. దీంతో నితిన్ ఎంట్రీ విషయంలో ఎన్టీఆర్ బ్యాక్ బోన్ లా నిలిచినట్లు కనిపిస్తుంది. మ్యాడ్ సినిమాకి నితిన్ ని తీసుకోవడం వెనుక...సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించడం ఇలా ప్రతీ విషయంలో టైగర్ కనిపిస్తున్నాడు. తాజాగా ఇదే విషయాన్ని నితిన్ నిన్నటి రోజున చెప్పే ప్రయత్నం చేసాడు. మా బావ లేకపోతే సినిమాల్లో నేను కష్టం అన్నట్లుగానే ఆయన వ్యాఖ్యానించారు.
'ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి నాకు .. ఈ సినిమా టీమ్ కి కూడా మా బావ ఎన్టీఆర్ సపోర్ట్ ఎంతో ఉంది. ఆయన సపోర్టు తోనే ఈ రోజున మాకు ఇంతమంది బ్లెస్సింగ్స్ దొరుకుతున్నాయి. అందుకు బావకి నేను థ్యాంక్స్ చెబుతున్నాను' అని అన్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దుల్కర్ సల్మాన్...సిద్దు జొన్నల గడ్డ..శ్రీలీల లాంటి స్టార్లు గెస్ట్ లుగా హాజరయ్యారు. ఇంతవరకూ బాగానే ఉంది. బావమరిదకి బావ నుంచి ఆ మాత్రం సహకారం ఎలాగూ దొరుకుతుంది.
అయితే ఇది కేవలం ఎంట్రీ కార్డు వరకే పరిమితం. ఆపై ఇండస్ట్రీలో రాణించాలంటే ట్యాలెంట్ తోనే ఎదగాలి. నటుడిగా నిరూపించుకోవాలి. కథల సెలక్షన్ విషయంలో యూనిక్ గా ఉండాలి. ప్రేక్షకుల పల్స్ పట్టుకుని స్టోరీలు ఎంపిక చేసుకోవాలి. ఎలాంటి పాత్రలోనైనా నటించగలగాలి. ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని లక్షణాలు కలిగి ఉండాలి. మరి నితిన్ లో అవన్నీ ఉన్నాయని యంగ్ టైగర్ అభిమానులు ఆశిస్తున్నారు.