నైజాం టాప్ 10లో కొత్త రికార్డులు.. వెంకీ - బన్నీ సినిమాలు ఏ స్థానంలో?
టాలీవుడ్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన భారీ చిత్రాల్లో పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి.
టాలీవుడ్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన భారీ చిత్రాల్లో పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. 2024 చివరిలో విడుదలైన పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక 2025 సంక్రాంతికి విడుదలైన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం పవర్ఫుల్ రన్‌ను కొనసాగిస్తూ ఇప్పటికే 260 కోట్ల గ్రాస్‌ను దాటి దూసుకుపోతోంది.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప 2 అన్ని ఏరియాల్లోనూ రికార్డు వసూళ్లు సాధించింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా 104.65 కోట్లు షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ టాప్ 2లో నిలిచింది. కేవలం RRR మాత్రమే 111.85 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. 2024 డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా 5 వారాల్లోనే 100 కోట్ల షేర్‌ను నైజాంలో సాధించడం విశేషం.
ఈ సంక్రాంతికి విడుదలైన వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం కూడా అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ సినిమా రెండు వారాల్లోనే నైజాంలో 37.64 కోట్ల షేర్‌ను వసూలు చేసి టాప్ 15లో చోటు సంపాదించింది. ఇంకా సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉండటంతో, టాప్ 10లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
ప్రభాస్ నటించిన కల్కి 2898 AD ఈ ఏరియాలో 92.80 కోట్ల షేర్‌ను సాధించి టాప్ 3లో నిలిచింది. మరో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ సలార్ 71.40 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. ప్రభాస్ కెరీర్లో అత్యధిక నైజాం షేర్ సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. ఇక అల్లు అర్జున్ కెరీర్లోనే మైలురాయిగా నిలిచిన అల వైకుంఠపురములో (44.88 కోట్లు), రాజమౌళి విజువల్ మాస్టర్‌పీస్ బాహుబలి 2 (68 కోట్లు), ఎన్టీఆర్ దేవర (62.90 కోట్లు) లాంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించాయి.
ఇప్పటివరకు RRR నైజాంలో హైయెస్ట్ షేర్ మూవీగా నిలిచినప్పటికీ, రానున్న రోజుల్లో మరికొందరు స్టార్స్ ఈ రికార్డును సమీపించే అవకాశం ఉంది. అలాగే సంక్రాంతికి వస్తున్నాం కూడా 40 కోట్ల షేర్ మార్క్‌ను టచ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
నైజాం ఏరియాలో ఆల్ టైమ్ టాప్ 10 షేర్ మూవీస్:
1. ఆర్ ఆర్ ఆర్ – 111.85 కోట్లు
2. పుష్ప 2 ది రూల్ – 104.65 కోట్లు
3. కల్కి 2898 ఏడి – 92.80 కోట్లు
4. సలార్ – 71.40 కోట్లు
5. బాహుబలి 2 – 68 కోట్లు
6. దేవర పార్ట్ 1 – 62.90 కోట్లు
7. అల వైకుంఠపురములో – 44.88 కోట్లు
8. బాహుబలి – 43 కోట్లు
9. కేజీఎఫ్ చాప్టర్ 2 (డబ్) – 42.93 కోట్లు
10. పుష్ప – 40.74 కోట్లు
11. సరిలేరు నీకెవ్వరు – 39.97 కోట్లు
12. హనుమాన్ – 39.25 కోట్లు
13. ఆదిపురుష్ – 39.20 కోట్లు
14. సంక్రాంతికి వస్తున్నాం – 37.64 కోట్లు (2 వారాలు)
15. వాల్తేరు వీరయ్య – 36.25 కోట్లు