సమంత బంగారం ఎంత వరకూ వచ్చిందో?
అయితే తానే సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
సమంత సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి ఏడాది దాటిపోయింది. ఆ తర్వాత మళ్లీ సామ్ బిగ్ స్క్రీన్ పై కనిపించింది లేదు. బయట బ్యానర్లలో సినిమాలేవి కమిట్ అవ్వలేదు. అవకాశాలు వచ్చిన వాటిని ఎందుకనో స్కిప్ కొడుతుంది. అయితే తానే సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ట్రాలాల మూవీంగ్ పిక్చర్స్ పై మా ఇంటి బంగారం చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇందులో తానే ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఈ చిత్రాన్ని ఏకంగా పాన్ ఇండియాలోనే రిలీజ్ చేస్తుంది. అయితే ఈ సినిమా ప్రకటనొచ్చి ఏడు నెలలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ మళ్లీ ఎలాంటి అప్ డేట్ అందించలేదు. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? ఇతర నటీ నటులు ఎవరు? అసలు సెట్స్ కి వెళ్లిందా? లేదా? అన్నది కూడా క్లారిటీ లేదు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అన్ని విషయాలు గోప్యంగా ఉంచుతుంది. మరి ఈ గోప్యత దేనికో తెలియాలి. అయితే ఈ ప్రాజెక్ట్ పనులన్ని ఎక్కువగా ముంబై నుంచే నడుస్తున్నాయని తెలిసింది.
మేజర్ పార్ట్ షూటింగ్ అంతా అక్కడే చేస్తున్నట్లు సమాచారం. సామ్ కొంత కాలంగా ముంబైలోనే ఉంటోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ కి రావడం బాగా తగ్గించేసింది. కావాల్సిన వాళ్లు సినిమా ఈవెంట్లకు ఆహ్వానిస్తే రావడం తప్ప టాలీవుడ్ లో తన సినిమా ప్రయత్నాలేవి కనిపించలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో `రక్తబ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్ డమ్` వెబ్ సిరీస్లో నటిస్తోంది. అలాగే అమ్మడు సోషల్ మీడియా యాక్టివిటీ కూడా తగ్గించింది.
మునుపటిలో యాక్టివ్ గా ఉండటం లేదు. అవసరం ఉంటే తప్ప! ఫోటో షూట్లు కూడా తగ్గించినట్లే కనిపిస్తుంది. చివరిగా ఖుషీ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. అటుపై విశ్రాంతి కోసం అమెరికా వెళ్లిపోయింది. కొన్ని నెలలు అనంతరం తిరిగి ముంబైకి చేరుకుంది. అప్పటి నుంచి ముంబైని విడిచి పెట్టడం లేదు.