జెంటిల్ మేన్ 2 పై ఆశించిన బ‌జ్ ఏదీ క‌నిపించ‌డం లేదు!

జెంటిల్‌మన్‌-2 తొలి షెడ్యూల్‌ పూర్తయింద‌ని తాజాగా చిత్ర‌బృందం ప్ర‌క‌టించినా దీనిని ఎవ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు.

Update: 2023-10-31 03:00 GMT

ద‌ర్శ‌కుడు శంక‌ర్ కి రీప్లేస్ మెంట్ అనేది ఉంటుందా? అంటే.. అస్స‌లు ఛాన్సే లేదు. అంత‌కంటే గొప్ప ద‌ర్శ‌కుడు ఉండొచ్చేమో కానీ అలాంటి ద‌ర్శ‌కుడు ఉండ‌డు. శంక‌ర్ ఒక యూనిక్ పీస్. జీనియ‌స్ బ్రెయిన్.. అత‌డి ఆలోచ‌నా విధానం.. విజువ‌ల్ గ్రాండియారిటీ .. క్వాలిటీ మేకింగ్ ఐడియాల‌జీ ఇవేవీ వేరొక‌రికి సాధ్యంకానివి. అందుకే ద‌శాబ్ధాల భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో అత‌డు త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక అధ్యాయాన్ని లిఖించాడు. ది జెంటిల్‌మేన్- భార‌తీయుడు 2- జీన్స్- బోయ్స్- అప‌రిచితుడు-రోబో-2.0- ఐ .. ఇవ‌న్నీ భారీ విజువ‌ల్స్ తో సిల్వ‌ర్ స్క్రీన్ పై మెస్మ‌రైజ్ చేసాయి. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ తో భారతీయుడు సీక్వెల్ ని తెర‌కెక్కించి రిలీజ్ కి తెస్తున్నారు. అదే స‌మ‌యంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా గేమ్ ఛేంజ‌ర్ లాంటి భారీ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

అయితే వీట‌న్నిటి న‌డుమా శంక‌ర్ తెర‌కెక్కించిన జెంటిల్‌మేన్ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంద‌నేది అంత‌గా ప్ర‌జ‌ల మైండ్ లో రిజిస్ట‌ర్ కాలేదు ఎందుక‌నో. జెంటిల్‌మన్‌-2 తొలి షెడ్యూల్‌ పూర్తయింద‌ని తాజాగా చిత్ర‌బృందం ప్ర‌క‌టించినా దీనిని ఎవ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. మ‌ధ్య మ‌ధ్య‌లో ఆప‌సోపాలు ప‌డుతూ పూర్తి చేస్తున్నా భార‌తీయుడు 2 పై ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి ఉందేమో కానీ, ఇప్పుడు తీస్తున్న జెంటిల్ మేన్ 2 పై ఆశించిన బ‌జ్ ఏదీ క‌నిపించ‌డం లేదు.

అయితే దీనికి కార‌ణం లేక‌పోలేదు. అస‌లు శంక‌ర్ తీయ‌ని 'జెంటిల్‌మేన్ 2' ఎవ‌రు చూస్తారు? అందుకే బ‌జ్ నిల్ అన్న చ‌ర్చా సాగుతోంది. ఎవ‌రో కొత్త హీరో.. ఎవ‌రో ద‌ర్శ‌కుడు.. అందుకే బ‌జ్ లేదు..అని కూడా నెటిజ‌నుల్లో డిబేట్ కొన‌సాగుతోంది. ఆస‌క్తిక‌రంగా ఈ చిత్రానికి ఆస్కార్ విన్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం.కీర‌వాణి సంగీతం అందిస్తున్నా.. మాతృక నిర్మాత స్వ‌యంగా బ‌రిలోకి దిగినా కానీ ఆశించినంత‌గా బ‌జ్ రాలేదు. వైరముత్తు సాహిత్యం అందించిన ఏడు పాటలున్న ఈ చిత్రానికి అజయన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తొట‌ తరణి ఆర్ట్ వర్క్స్‌ని పర్యవేక్షిస్తున్నారు..సతీష్ సూర్య ఎడిటింగ్‌ను చూస్తున్నారు. వీరంతా జాతీయ అవార్డులు అందుకున్న ప్ర‌ముఖులు కూడా. కానీ ఎందుక‌నో ఆశించిన ఊపు అయితే రాలేదు. ఎంద‌రు ఉన్నా శంక‌ర్ లేడు క‌దా? అన్న‌దే అభిమానుల ప్ర‌శ్న‌.

టెక్నిక‌ల్ గా వివ‌రాల్లోకి వెళితే..

చేతన్‌ కథానాయకుడిగా ఎ. గోకుల్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న జెంటిల్‌మన్‌-2 చెన్నై పరిసర ప్రాంతాల్లో మొదటి దశ షూటింగ్‌ను 15 రోజుల్లో ముగించారు. ఈ షెడ్యూల్‌లో చేతన్, నయనతార చక్రవర్తి, ప్రియా లాల్, బాడవ గోపి, సుధా రాణి, సితార, శ్రీ లత, కన్మణి, లొల్లు సభ స్వామినాథన్, బేబీ పద్మ రాగం మరియు ముల్లై-కోతాండమ్‌లు చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్నారు. అంతేకాకుండా, స్టంట్ మాస్టర్ దినేష్ కాసి కొరియోగ్రఫీ చేసిన ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాన్ని కూడా ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించారు.

ప్రతి అంశంలో గ్రాండ్‌నెస్‌ని కప్పి ఉంచే తదుపరి షెడ్యూల్ నవంబర్ మూడవ వారంలో ప్రారంభమవుతుంద‌ని టీమ్ చెబుతోంది. మునుముందు చెన్నై, హైదరాబాద్, పాండిచ్చేరిలో తెర‌కెక్కిస్తారు. ఇతర షెడ్యూల్‌లను మలేషియా, దుబాయ్, శ్రీలంకలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో సుమన్, మనోజ్ కె జయన్, ప్రసిక్క, కాంతారావు విలన్ అచ్యుత్ కుమార్, బాడవ గోపి, మునీష్ రాజా, ఆర్.వి.ఉదయకుమార్, సెంద్రాయన్, మైమ్ గోపి, రవి ప్రకాష్, శిశిర్ శర్మ, వేల రామమూర్తి, జాన్ మహేంద్రన్, కల్లూరి విమల్, జిగర్తాండ రామ్స్, ప్రేమ్ కుమార్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. బృందా నృత్య దర్శకత్వం వహిస్తుండగా, జెరీనా స్టైలిస్ట్‌గా పూర్ణిమ రామసామి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు.

Tags:    

Similar News