మెగా - వంగా కాంబో.. ఛాన్స్ లేదమ్మా!
అయితే ఇప్పుడు గత రెండు మూడు రోజులుగా చిరంజీవి-సందీప్ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా సినిమా రాబోతుందని అంటున్నారు.
ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్స్‌కు అవకాశాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరు.. సందీప్ రెడ్డి వంగాతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు తెగ ప్రచారం సాగుతోంది. పాన్ ఇండియా లెవల్లో ఇది రానుందంటూ చాలా మంది అంటున్నారు. కానీ ఇది వర్కౌట్ అయ్యే అవకాశం కనిపించడం లేదు.
వివరాళ్లోకి వెళితే.. తొలి సినిమా అర్జున్ రెడ్డితో సెన్సేషన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సందీప్ వంగా.. ఆ తర్వాత అదే చిత్రాన్ని హిందీలోనూ కబీర్ సింగ్‌గా రీమేక్ చేసి మరో సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన.. రణ్‌బీర్ సింగ్‌తో యానిమల్ అనే భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాడు. అది మరో రెండు నెలల తర్వాత రిలీజ్ కానుంది.
అయితే అతడు స్వతహాగా పవన్ కళ్యాణ్‌కు అభిమాని. అలాగే చిరంజీవి కూడా. అయితే ఇప్పుడు గత రెండు మూడు రోజులుగా చిరంజీవి-సందీప్ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా సినిమా రాబోతుందని అంటున్నారు. కానీ వాస్తవిక కోణంలో చూస్తే అది అయ్యేట్లు కనిపించడం లేదు. ఎందుకంటే యానిమల్ డిసెంబర్లో రిలీజ్ అవుతుంది.
ఆ తర్వాత ఆయన జనవరి నుంచి ప్రభాస్ స్పిరిట్ కోసం పని చేస్తాడు. 2024 జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం పెట్టే దిశగా అడుగులు వేయాలి. కాబట్టి ఆలోగా స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవాలి. ఈ చిత్రం పూర్తయ్యే సరికి కనీసం 2025 అవుతుంది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయాలి. దీనికో మరో రెండేళ్లైనా పడుతుంది. అంటే 2027 వచ్చేస్తుంది.
దీని తర్వాత మహేశ్ బాబుతో ఓ సినిమా చేయాలనే ప్లాన్ ఉంది. కథ సిద్ధమైతే రాజమౌళి తర్వాత ఈ కాంబో రావొచ్చు. ఇదంతా జరిగే సరికి 2030 వచ్చేస్తుంది. అంటే ఈలోగా చిరు ఓ ఐదు ఆరు సినిమాలు చేసి హీరోగా రిటైర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక పవన్ పొలిటిక్స్ కమిట్స్మెంట్స్పై ఆయనతో సినిమా ఆధారపడి ఉంటుంది. కాబట్టి పవన్ సంగతి పక్కన పెడితే.. మెగాస్టార్- సందీప్ వంగా కాంబోలో సినిమా రావడం కష్టమే అని చెప్పొచ్చు.